ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులందరికీ .. మోదీ కీలక నిర్ణయం

Published: Friday February 25, 2022

న్యూఢిల్లీ: ఉక్రెయిన్- రష్యా యుద్ధ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులందరికీ ఊరటనిచ్చే విషయం చెప్పారు. సొంత ఖర్చుతో వెనక్కి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ ఇప్పటికే చర్చలు జరిపారు. భారత విమానాలు ఉక్రెయిన్ చేరుకుని భారతీయులను వెనక్కు తీసుకువచ్చేందుకు మార్గం సుగమం చేశారు.