కూలిన శిక్షణ విమానం

Published: Saturday February 26, 2022

జిల్లాలో శిక్షణ విమానం కూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పెద్దవూర మండలం తుంగతుర్తి దగ్గర ఈ ఘటన జరిగింది. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసు, రెవెన్యూ, వైద్య సిబ్బంది.. ప్లైటెక్‌ ఏవియేషన్‌ అకాడమీకి చెందిన విమానంగా గుర్తించారు. ట్రైనింగ్ విమానం మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో తమిళనాడుకు చెందిన ట్రైనీ పైలెట్ ఉన్నారు. దట్టమైన పొగతో ఈ ట్రైనీ విమానం ఒక్కసారిగా కుప్పకూలినట్లు అధికారులు ధృవీకరించారు. 

గతంలో ఫ్లైటెక్ ఏవియేషన్‌పై చాలా ఫిర్యాదులు ఉన్నాయి. ఆ సమయంలో సీబీఐ, ఈడీ, బీఆర్ఐ సంస్థల విచారణ కూడా జరిగింది. ట్రైనింగ్‌లో సరైన ప్రమాణాలు పాటించడంలేదని అటు ఏవియేషన్ డైరెక్టర్‌కు కూడా చాలా ఫిర్యాదులు అందాయి. రెండేళ్ల క్రితం ఫ్లైటెక్ ఏవియేషన్‌లో డీజీసీఐ తనిఖీలు నిర్వహించింది.