పాకిస్తాన్‌లోని పెషావర్ మసీదులో బాంబ్ బ్లాస్ట్
Published: Friday March 04, 2022

పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఉన్న మసీదులో జరిగిన బాంబ్ బ్లాస్ట్‌లో మృతుల సంఖ్య 45కి పెరిగింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారి సంఖ్య సైతం 65కి పెరిగిందని పెషావర్ సిటీ పోలీస్ అధికారి ఇజాజ్ అషాన్ పేర్కొన్నారు. పెషావర్‌లోని కిస్సా ఖ్వాని బజార్ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. గాయపడ్డ వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇజాజ్ అషాన్ చెప్పిన వివరాల ప్రకారం.. ఇద్దరు దుండగులు మసీదులోకి చొరబడే ప్రయత్నంలో ముందుగా డ్యూటీలో ఉన్న పోలీసులపై కాల్పులు జరిపారట. అనంతరం మసీదులో బీభత్సం సృష్టించారని తెలిపారు. శుక్రవారం ప్రార్థన జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగిందని, అయితే ఈ దాడిపై ఏ తీవ్రవాద సంస్థ ఇప్పటి వరకు స్పందించలేదని పెషావర్ పోలీసులు పేర్కొన్నారు.

Share this on your social network: