అభివృద్ధి వికేంద్రీకరణే మా విధానం

Published: Friday March 04, 2022

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా అభివృద్ధి వికేంద్రీకరణే ప్రభుత్వ విధానమని హోం మంత్రి మేకతోటి సుచరిత పునరుద్ఘాటించారు. శుక్రవారం ఏఎన్‌యూలో జరిగిన జాతీయ మహిళా పార్లమెంటు సమావేశానికి హాజరైన ఆమె మీడియాతో మాట్లాడారు. రాజధాని ఎక్కడ ఉండాలన్న అంశం రాష్ట్ర పరిధిలోనిదని కేంద్రం చెబుతోందని, రాజధానిపై శాసన నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కోర్టు చెప్పిందన్నారు. దీనినిబట్టి చెప్పేవారికే స్పష్టతలేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. అమరావతి శాసన రాజధానిగా ఉంటోందని, మొత్తం తరలిస్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. రాజధానిపై తమకు స్పష్టత ఉందని సుచరిత తెలిపారు.