ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం

Published: Monday March 07, 2022

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అత్యధిక ఎగ్జిట్ పోల్స్‌ వెల్లడిస్తున్నాయి. మోదీ - యోగీ డబుల్ ఇంజిన్ సర్కారుకు మళ్లీ ప్రజామోదం లభించిందని తెలిపాయి. రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం యూపీలో బీజేపీకి 262 నుంచి 277 స్థానాలు దక్కుతాయి. న్యూస్ 18 ప్రకారం బీజేపీకి 263 స్థానాలు దక్కుతాయి. పీపుల్స్ పల్స్ 220 నుంచి 240 స్థానాలు బీజేపీకి దక్కుతాయని వెల్లడించింది.