సింగరేణి ఆండ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టు గనిలో ప్రమాదం

Published: Monday March 07, 2022

పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలోని సింగరేణి ఆండ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టు  గనిలో ప్రమాదం జరిగింది. బొగ్గు గని పైకప్పు కూలి నలుగురు మృతి చెందారు. మృతుల్లో అసిస్టెంట్‌ మేనేజర్‌, ముగ్గురు కార్మికులు ఉన్నారు. రాళ్ళ à°•à°¿à°‚à°¦ మరో ఆరుగురు కార్మికులు చిక్కుకున్నారు. సహాయం కోసం కార్మికులు ఆర్తనాదాలు చేస్తున్నారు. దీంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గనిలోకి సింగరేణి రెస్క్యూ టీం దిగుతోంది. పూర్తి వివరాలను ఇప్పుడే చెప్పలేమని అధికారులు పేర్కొన్నారు.

గనిలో చిక్కుకున్న వారిని తేజ అసిస్టెంట్ మేనేజర్, జాది వెంకటేశ్వర్లు--ఆపరేటర్, రవీందర్--- వర్కర్, పిల్లి నరేష్ కార్మికుడు, మీస వీరయ్య --సపోర్ట్‌మెన్ à°—à°¾ గుర్తించారు.  అయితే మృతుల సంఖ్యపై  యాజమాన్యం క్లారిటీ ఇవ్వడం లేదు. అలాగే ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై  యాజమాన్యం గోప్యత పాటిస్తోంది.