రష్యా బాంబు దాడిలో ఉక్రెయిన్ నటుడు పాషా లీ మృతి

Published: Wednesday March 09, 2022

ఉక్రెయిన్ నటుడు పాషా లీ రష్యా బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు ఆయన ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తమ దేశంపై రష్యన్ బాంబులు పడుతున్న తీరును చిత్రీకరిస్తున్నామని, ఈ పరిస్థితిని తాము నిభాయించగలం కాబట్టి తాము చిరునవ్వుతో ఉంటున్నామని పేర్కొన్నారు. 

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత పాషా లీ ఉక్రెయిన్ టెరిటోరియల్ డిఫెన్స్ ఫోర్స్‌లో చేరారు. ఇర్పిన్ నగరవాసి అయిన పాషా చాలా చిత్రాల్లో నటించారు. టీవీ ప్రజెంటర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. 

మరణానికి ముందు ఆయన ఇచ్చిన చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, ‘‘గడచిన 48 గంటల నుంచి కూర్చుని, మాపై ఏ విధంగా బాంబులేస్తున్నారో చిత్రీకరించే అవకాశం కలిగింది, మేం చిరునవ్వుతో ఉన్నాం, ఎందుకంటే, మేం దీనిని నిభాయించగలం’’ అని పేర్కొన్నారు. 

రష్యాపై పోరాడటం కోసం సైన్యంలో చేరిన పాషా లీ మరణించడంపై ఉక్రెయినియన్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. పాషా జన్మస్థలం క్రిమియాలో ఉంది.