లక్షా 2 వేల ఓట్లతో గెలిచిన యోగి

Published: Thursday March 10, 2022

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్షా రెండు వేల మెజార్టీతో గెలుపొందారు. గోరఖ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గారు. అంతేకాదు గోరఖ్‌పూర్‌ ఎంపీ నియోజకవర్గంలోని మొత్తం 9 అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్ధులను గెలిపించుకున్నారు.