రండి.. మా దేశంలో పెట్టుబడులు పెట్టండి

Published: Saturday March 12, 2022

ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో అమెరికా సహా పలు దేశాల నుంచి తీవ్ర ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా.. భారత్ సహకారాన్ని అర్థిస్తోంది. చమురు, గ్యాస్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని భారత్‌ను కోరింది. పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా 1991 తర్వాత రష్యా తొలిసారి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఐక్యరాజ్య సమితిలో రష్యాకు వ్యతిరేకంగా ఓటేయాలని పలు దేశాలు భారత్‌ను కోరినప్పటికీ భారత్ మాత్రం తటస్థంగా ఉండిపోయింది

రష్యా నుంచి భారత్‌కు జరుగుతున్న పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు దాదాపు బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతేకాదు, భవిష్యత్తులో à°ˆ ఎగుమతులు మరింతగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రష్యా డిప్యూటీ ప్రధానమంత్రి అలెగ్జాండర్ నోవాక్ తెలిపారు. రష్యన్ చమురు, గ్యాస్ రంగంలో భారత్ నుంచి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు, భారత్‌లో రష్యన్ కంపెనీ విక్రయ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేందుకు తాము ఆసక్తిగా ఉన్నట్టు  భారత పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి నొవాక్ వివరించారు. 

రష్యా నుంచి చమురు దిగుమతులను నిషేధిస్తున్నట్టు అమెరికా à°ˆ వారం ప్రకటించింది. బ్రిటన్ కూడా ఇలాంటి పర్యటనే చేసింది. ముడి చమురు ఎగుమతుల్లో ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉంది.  భారత ప్రభుత్వరంగ కంపెనీలు రష్యన్ చమురు, గ్యాస్ క్షేత్రాల్లో వాటాలను కలిగి ఉన్నాయి.

రోస్‌నెఫ్ట్‌తో సహా రష్యన్ సంస్థలు భారతీయ రిఫైనర్ నయారా ఎనర్జీలో మెజారిటీ వాటా కలిగి ఉంది. కొన్ని భారతీయ కంపెనీలు రష్యా చమురును కూడా కొనుగోలు చేస్తున్నాయి. భారత్‌లోని  కూడంకుళంలో అణు విద్యుత్ ప్లాంట్‌లో కొత్త యూనిట్లను నిర్మించడంతో పాటు పౌర అణుశక్తిపై సహకారాన్ని ఇరు దేశాలు కొనసాగించాలని రష్యా ఆశిస్తున్నట్లు నోవాక్ చెప్పారు.