రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అమెరికన్ ఇంటలిజెన్స్ నివేదిక

Published: Sunday March 13, 2022

రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అమెరికన్ ఇంటలిజెన్స్ నివేదిక వెల్లడించింది. క్యాన్సర్ చికిత్సలో భాగంగా తీసుకుంటున్న స్టెరాయిడ్ల వల్లే పుతిన్‌లో విపరీత ఆలోచనలు వస్తున్నాయేమోనని అనుమానం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌పై దాడితో పాటు అణ్వస్త్ర బలగాలను సన్నద్ధంగా ఉండాలని చెప్పడం వెనుక స్టెరాయిడ్ల వాడకం ఉండొచ్చని అమెరికన్ ఇంటలిజెన్స్ నివేదిక తెలియజేస్తోంది. పుతిన్ ముఖంలో వస్తున్న మార్పులు దీనికి బలం చేకూరుస్తోందని వెల్లడించింది. పుతిన్‌ ఎవరిని కలిసినా 13 అడుగుల టేబుల్ గ్యాప్ పెట్టడాన్ని కూడా అనుమానంగా చూస్తున్నారు. అయితే అమెరికన్ ఇంటలిజెన్స్ నివేదికపై రష్యా స్పందించాల్సి ఉంది. 

మరోవైపు ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం ప్రారంభమై 17 రోజులు గడుస్తోంది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ వాసులు సుమారు 2 కోట్ల మంది దేశం విడిచి పొరుగుదేశాలకు వెళ్లారని ఐక్యరాజ్యసమితి లెక్కలు చెబుతోంది.