జనసేన పార్టీ ఆవిర్భావ సభ

Published: Monday March 14, 2022

తాడేపల్లి మండలం ఇప్పటంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ప్రారంభమైంది. సభకు జనసైనికులతో పాటు ప్రజలు భారీగా వచ్చారు. పార్టీ ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తైన సందర్భంగా భారీ సభను నిర్వహిస్తున్నారు. మద్యాహ్నం నుంచి రాత్రి 7:30 వరకు సభను నిర్వహిస్తారు. ఈ సభకు అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ హాజరుకానున్నారు. సాయంత్రం 6 గంటలకు పవన్ ప్రసంగిస్తారు. సభలో పార్టీ కార్యకర్తలకు పవన్‌కల్యాణ్‌ దిశానిర్దేశం చేస్తారు. 

భావి కార్యచరణఫై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ విస్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. తొమ్మిదేళ్ల కింద ఆవిర్భవించిన ఆ పార్టీ.. 2014 ఎన్నికల్లో పోటీచేయకుండా టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించింది. 2019 ఎన్నికల్లో వామపక్షాలు, బీఎస్పీతో కలిసి పోటీ చేసినప్పటికీ కేవలం ఒక్క స్థానంలో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఆ అనుభవాల దృష్ట్యా ఈసారి పకడ్బందీ వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. అది కూడా ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే వ్యూహాలను రూపొందించుకోవాలని యోచిస్తోంది.