క్వారీలు, గనులను బడాబాబులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ
Published: Monday March 14, 2022

ఏపీలో క్వారీలు, గనులను బడాబాబులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. ఇకముందు క్వారీలు, గనులను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన జీఓ నెంబర్ 13, 14ను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ ఆక్షన్ ద్వారా క్వారీలు వేలం వేయాలని నిర్ణయం తీసుకుంది. స్థానికంగా ఉండే సోసైటీలకు, ఆయా మండలాలకు చెందిన క్వారీలను 15 హెక్టార్లకు మించకుండా అప్పగించేందుకు ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇప్పటికే నిర్వహిస్తున్న క్వారీల లీజు గడువు ముగిసిన తరువాత వేలం వేయనున్నారు. పదిరెట్లు అదనంగా లీజు చెల్లించాలని జీఓలో ప్రభుత్వం పేర్కొంది. క్వారీ లీజు తీసుకునే ముందు టెస్ట్‌లు చేసే బాధ్యత ఎవరిదని యజమానులు ప్రశ్నిస్తున్నారు. అనుకున్న విధంగా మెటీరియల్ క్వారీలో లభించకపోతే బాధ్యత ఎవరిదని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు.

Share this on your social network: