ఇస్కాన్ రాధాకాంత ఆలయంపై అల్లరిమూక దాడి
Published: Friday March 18, 2022

బంగ్లాదేశ్‌లో దారుణం జరిగింది. రాజధాని నగరమైన ఢాకాలోని ఇస్కాన్ రాధాకాంత దేవాలయంపై 200మందితో కూడిన అల్లరిమూక గురువారం దాడి చేసి, ఆలయాన్ని ధ్వంసం చేసింది. ఆలయంపై దాడి చేసిన అల్లరిమూకకు హాజీ షఫీవుల్లా నాయకత్వం వహించాడని ఢాకా పోలీసులు చెప్పారు. ఆలయంపై జరిపిన దాడిలో సుమంత్ర చంద్ర శ్రవణ్, నిహార్ హల్దార్, రాజీవ్ భద్ర సహా పలువురు గాయపడ్డారు.ఆలయంలోని వస్తువులను దుండగులు దోచుకున్నారని ఆలయ సిబ్బంది చెప్పారు. గత సంవత్సరం బంగ్లాదేశ్‌లోని కొమిల్లా పట్టణంలోని ననువార్ దిగి సరస్సు సమీపంలోని దుర్గా పూజ పండల్ వద్ద ఖురాన్‌ను అపవిత్రం చేశారని సోషల్ మీడియాలో వార్తలు వ్యాపించడంతో హింస చెలరేగింది.ఆ హింసాకాండలో ముగ్గురు మరణించారు.గతంలో ఢాకాలోని టిప్పు సుల్తాన్ రోడ్డు, చిట్టగాంగ్‌లోని కొత్వాలిలలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి.

Share this on your social network: