పొంచి ఉన్న కరోనా ముప్పు..

Published: Friday March 18, 2022

దక్షిణ కొరియా, చైనాతోపాటు ఆగ్నేయాసియా దేశాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. దేశంలో నాలుగోవేవ్ రాకుండా ఐదంచెల వ్యూహాన్ని అమలుచేయాలని సూచించింది. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీటింగ్, వ్యాక్సినేషన్, కరోనా ప్రవర్తనను అంచనా వేయడం ద్వారా కరోనాను అడ్డుకోవాలని కేంద్రం రాసిన లేఖలో పేర్కొంది. జీనోమ్ సీక్వెన్సింగ్‌తోపాటు, కచ్చితమైన నిఘా ఉంచడం వల్ల ఫోర్త్ వేవ్ రాకుండా చూసుకోవాలని సూచించింది. à°—à°¡à°šà°¿à°¨ 24 గంటల్లో దేశంలో 2,528 కరోనా కేసులు నమోదయ్యాయి. మూడువేల కంటే తక్కువ కేసులు నమోదు కావడం వరుసగా ఇది ఐదోసారి. మన దేశంలో కరోనా కేసులు తగ్గుతుంటే, కొన్ని దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. à°ˆ నేపథ్యంలో కరోనా విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడం, మాస్కులు ధరించేలా చూడటం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం వంటి కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని కేంద్రం కోరింది.