రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల కార్యక్రమం

Published: Monday March 28, 2022

 దేశ రాజధాని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. బీజేపీ మాజీ సీఎం కళ్యాణ్‌సింగ్‌కు (మరణానంతరం) ప్రకటించిన పద్మ విభూషణ్ అవార్డును ఆయన కుమారుడు రాజ్‌వీర్ సింగ్ అందుకున్నారు. అలాగే పద్మ భూషణ్ అవార్డును భారత్ బయోటెక్ ఎండీ కృష్ణా ఎల్లా, సీఎండీ సుచిత్రా ఎల్లా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చొప్రా సహా పలువురు క్రీడాకారులు పద్మ అవార్డులు అందుకున్నారు.