గుంటూరు జిల్లాలో దారుణం
Published: Wednesday March 30, 2022

జిల్లాలోని తెనాలిలో దారుణం జరిగింది. బాలుడిపై పాస్టర్ లైంగిక దాడి చేశాడు. పాస్టర్ అహరోన్ ప్రకాశ్ తనపై లైంగిక దాడి చేసినట్లు బాలుడు తెలిపాడు. గత 10 నెలలుగా కల్వరీ ప్రార్థనా మందిరంలో ఆ బాలుడు ఉంటున్నాడు. బాలుడు అనారోగ్యంగా ఉండడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. దీంతో తనపై జరిగిన అమానుష సంఘటనను వివరించాడు. ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే కేసును వాపస్ తీసుకోవాలని బాధితులతో క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ మంతనాలు జరుపుతున్నాడు

Share this on your social network: