న్యూయార్క్ నగరంలో కాల్పులు..

Published: Tuesday April 12, 2022

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన కాల్పులు ఘటనలో 13 మంది గాయపడ్డారు. న్యూయార్క్ నగరంలోని బ్లూక్లిన్‌లో ఉన్న సబ్‌వేలో మంగళవారం సాయంత్రం ఒక వ్యక్తి ఉన్నట్లుండి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో పదమూడు మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, నిందితుడు నిర్మాణ రంగ కార్మికుడిలా డ్రెస్ చేసుకుని ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో విపరీతమైన పొగ కమ్ముకుంది. దీంతో ఫైర్ సిబ్బంది, భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితుల్ని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఘటనాస్థలం నుంచి కొన్ని పేలుడు పదార్థాల్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. దీన్ని ఉగ్రదాడిగా అధికారులు అనుమానిస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.