బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సభలో పేలుడు

Published: Tuesday April 12, 2022

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నలందలో నిర్వహిస్తున్న జనసభలో పేలుడు కలకలం సృష్టించింది. వేదికకు అతి సమీపంలో ఘటన జరగడంతో జనం పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. పేలుడు ఘటనకు సంబంధించి ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి అది బాంబు దాడి కాదని బాణాసంచా అని పోలీసులు తేల్చారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. నితీశ్‌పై రెండు వారాల క్రితం భక్తియార్‌పూర్‌లో ఓ యువకుడు దాడి చేశాడు. అతడి మానసిక పరిస్థితి బాగలేదని ఆ తర్వాత వదిలిపెట్టారు.