హోదా ఇవ్వలేదు... ప్యాకేజీకి చట్ట బద్ధత లేదు

Published: Friday July 20, 2018
‘ప్రత్యేక ప్యాకేజీని పవన్‌ కల్యాణ్‌ పాచిపోయిన లడ్డూలతో పోల్చారు. అదే పవన్‌ ఇప్పుడు హోదా కోసం మోదీని ఎందుకు నిలదీయడం లేదు? వైసీపీ కూడా హోదాపై మోదీని ప్రశ్నించేందుకు వెనుకాడుతోంది’’ అని సీనియర్‌ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో ఆంధ్ర జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఢిల్లీ (ఆజాద్‌) నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’లో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇస్తామన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో ఉంచుకొనే ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ... ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించకపోవడం, అనుకున్నంత మేరకు ప్రయోజనం లభించే అవకాశం లేదని గ్రహించి మళ్లీ ప్రత్యేక హోదా కోసమే పట్టుబట్టారని తెలిపారు.
 
‘‘రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్యాకేజీకి అంగీకరించడం à°Žà°‚à°¤ సరైనదో... ప్రత్యేక హోదా కోసం మళ్లీ పట్టుబట్టాలని నిర్ణయించుకోవడం అంతే సరైనది! చంద్రబాబు రెండుసార్లూ సరైన నిర్ణయమే తీసుకున్నారు. కానీ... బీజేపీయే రాష్ట్ర ప్రజలను పూర్తిగా మోసం చేసింది’’ అని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీపై à°† పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే దానికి చట్టబద్ధత ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని మాట్లాడిన మోదీ... ప్రత్యేక హోదాకు తాము కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. వెంకయ్య నాయుడు కూడా ప్రత్యేక హోదా 10 ఏళ్లు కల్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. à°ˆ ఉల్లంఘన గురించి మోదీని ఎందుకు నిలదీయడం లేదని వైసీపీ, జనసేన నేతల్ని సబ్బం హరి ప్రశ్నించారు.