పార్టీ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు

Published: Saturday July 21, 2018
తెలుగుదేశం ఎంపీలు గల్లా జయదేవ్‌, కింజరాపు రామ్మోహన్‌నాయుడులను à°† పార్టీ అధినేత చంద్రబాబు ఘనంగా ప్రశంసించారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చలో వారిద్దరూ మాట్లాడాక ఆయన ఇక్కడ నుంచి ఫోను చేసి వారిని మెచ్చుకున్నారు. ’బాగా మాట్లాడారు. వెరీ గుడ్‌. పార్టీ ప్రతిష్ఠను ఇనుమడింపచేశారు. తెలుగువారి పోరాట పటి మను పార్లమెంటు వేదికగా చాటారు’ అని వారితో అన్నారు. ఎంపీలుగా మొదటిసారి ఎన్నికైనప్పటికీ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని చాలా చక్కగా చెప్పగలిగారని.. అవిశ్వాసం పెట్టిన ఫలితం చూపించారని పార్టీ నేతల వద్ద వ్యాఖ్యానించారు.
 
à°ˆ ఇద్దరు ఎంపీలను ఆయన వ్యూహాత్మకంగా à°ˆ చర్చకు ఎంపిక చేశారు. à°ˆ ఇద్దరిలో అమెరికాలో చదువుకుని వచ్చిన జయదేవ్‌ ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలరు. రామ్మోహన్‌ గతంలో కొంతకాలం ఢిల్లీలో ఉద్యోగం చేసి హిందీ భాషపై పట్టు సాధించారు. జాతీయ స్థాయిలో రాష్ట్ర అంశాలను ప్రముఖంగా చాటి చెప్పడానికి à°ˆ ఇద్దరూ సరిపోతారన్న అంచనాతో చంద్రబాబు వారిని ఎంపిక చేశారు. గతంలో పార్లమెంటులో వివిధ సందర్భాల్లో ప్రసంగించడం ద్వారా వారు అప్పటికే కొంత గుర్తింపు సంపాదించారు. అవిశ్వాసం నోటీసు ఇచ్చిన ఎంపీగా కేశినేని నాని ప్రసంగించాల్సి ఉంది.
 
కాని ఆయనకు కొంత భాషాపరమైన సమస్య ఉండడంతో ఆయన స్థానంలో జయదేవ్‌ను ఎంపిక చేసి ఆయనతో చర్చ ప్రారంభింపజేశారు. వీరిద్దరి ఎంపిక సరైనదేనని లోక్‌సభలో జరిగిన చర్చ నిరూపించిందని టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఒక్కో అంశాన్ని విపులంగా వివరిస్తూ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని జయదేవ్‌ వివరించారు. సందర్భాన్ని బట్టి రాజకీయ విమర్శలు జోడిస్తూ సంయమనంతో తన వాదన వినిపించారు. ఆయన బాగా మాట్లాడారని మెచ్చుకున్న చంద్రబాబు.. à°† తర్వాత మాట్లాడాల్సిన రామ్మోహన్‌నాయుడికి మరో కోణం అప్పగించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం భావోద్వేగంతో కూడుకున్న అంశం కావడంతో కొంత ఉద్వేగభరితంగా మాట్లాడాలని సూచించారు. రామ్మోహన్‌ సరిగ్గా అదే పద్ధతిలో ఉద్వేగం, ఆవేశం కలగలిపి తీవ్ర స్థాయిలో మోదీ ప్రభుత్వంపై దాడిచేశారు. సచివాలయంలోని తన కార్యాలయంలో టీవీ ముందు కూర్చున్న చంద్రబాబు చిరునవ్వుతో రామ్మోహన్‌ ప్రసంగాన్ని వీక్షించారు. ఆయనకు సమయం తక్కువ లభించినా బాగా బలంగా తన వాదన వినిపించారని, లోక్‌సభను ఆకట్టుకున్నారని టీడీపీ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఆంధ్ర ప్రాంతం వారికి హిందీ రాదన్న అభిప్రాయం చాలా మందిలో ఉందని, రామ్మోహన్‌ à°† దురభిప్రాయాన్ని పోగొట్టారని వ్యాఖ్యానించారు.