శ్రీవారి ఆలయానికి తాళం

Published: Thursday July 26, 2018
 à°šà°‚ద్రగ్రహణాన్ని పురస్కరించుకొని రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. శుక్రవారం రాత్రి 11.54 à°—à°‚à°Ÿà°² నుంచి శనివారం వేకువజాము 3.49à°—à°‚à°Ÿà°² వరకు చంద్రగ్రహణం సంభవించనుంది. గ్రహణం మొదలయ్యే సమయానికి ఆరు à°—à°‚à°Ÿà°² ముందుగా ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీ. à°ˆ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 5గంటలకు ఆలయ తలుపులను మూసివేసి గ్రహణం వీడిన తర్వాత శనివారం వేకువజామున 4.15గంటలకు తెరుస్తారు. à°† వెంటనే సుప్రభాత సేవతో పాటు శుద్ధి, పుణ్యాహవచనం చేస్తారు. అనంతరం తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించి, ఉదయం 7à°—à°‚à°Ÿà°² నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
 
 
గ్రహణం నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకే సర్వదర్శనం క్యూలైన్‌ మూసివేస్తారు. అప్పటికే క్యూలో, కంపార్టుమెంట్‌లో వేచివున్న భక్తులకు గురువారం అర్థరాత్రి వరకు దర్శనం చేయిస్తారు. ఇంకా మిగిలినవారికి శుక్రవారం ఉదయం 10à°—à°‚à°Ÿà°² నుంచి సాయంత్రం 4à°—à°‚à°Ÿà°² లోపే దర్శనం కల్పిస్తారు. అభిషేకం కారణంగా శుక్రవారం దర్శనం ఆలస్యంగా మొదలవుతుంది. దీంతో కేవలం ప్రోటోకాల్‌ ప్రముఖులకే వీఐపీ టికెట్లను పరిమితం చేశారు.
 
అలాగే రూ.300 టికెట్లు, స్లాటెడ్‌ దివ్య, సర్వదర్శనం టోకెన్ల జారీని ఇప్పటికే రద్దు చేశారు. భక్తులు à°ˆ మార్పులను గమనించి సహకరించాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తిచేశారు. గ్రహణం కారణంగా శుక్రవారం మధ్యాహ్నం భోజనం వితరణ తరువాత అన్నదాన సముదాయాలు, కౌంటర్లు మూసివేస్తారు. చంద్రగ్రహణం సందర్భంగా 27à°¨ నిర్వహించాల్సిన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ, పున్నమి గరుడసేవలను రద్దు చేశారు.