ఏడాదికి రూ.1470 కోట్ల వ్యయం

Published: Wednesday August 01, 2018
 à°’కవైపు నిరుద్యోగ యువతకు ఆర్థికంగా సాయం... మరోవైపు వారికి అవసరమైన నైపుణ్యాల శిక్షణ, ఉద్యోగ కల్పనకు మార్గదర్శనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నిరుద్యోగ యువతకు భృతి అందించేందుకు ప్రభుత్వం à°ˆ మేరకు తుది ప్రణాళిక సిద్ధం చేసింది. ‘యువసాధికారిక నిరుద్యోగ భృతి’ పేరిట à°ˆ పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రతి నెలా 12.26 లక్షల మందికి భృతి ఇస్తారు. పల్స్‌ సర్వే లెక్కల నుంచి తీసుకున్న నిరుద్యోగులకు ప్రతి నెలా వెయ్యి రూపాయల చొప్పున ఆన్‌లైన్‌లోనే చెల్లించనున్నారు. ఏడాదికి రూ.1470 కోట్లు దీనికోసం అవసరం అవుతాయని అంచనా వేశారు. ఏదైనా డిగ్రీ, పాలిటెక్నిక్‌ డిప్లొమాలను నిరుద్యోగ భృతి పథకానికి అర్హతగా నిర్ణయించారు. 22-35 ఏళ్ల మధ్య యువత ఇందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వారి దామాషా ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి. అదే సమయంలో à°’à°• ఇంట్లో అర్హులు ఎందరున్నా... వారందరికీ నిరుద్యోగ భృతిని అందించాలని నిర్ణయించారు.
 
 
భృతి.. ఇష్టమైన రంగానికీ దరఖాస్తు
నిరుద్యోగ భృతి దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే తీసుకోనున్నారు. దీనికోసం ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ ఏర్పాటు చేస్తారు. నిరుద్యోగ భృతి ప్రకటన ఇచ్చాక... అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు 15 నుంచి 21 రోజుల సమయం ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. దరఖాస్తు సమయంలోనే తనకు ఇష్టమైన రంగాన్ని అభ్యర్థి పేర్కొనాలి. స్వయం ఉపాధి, పరిశ్రమల్లో అప్రెంటిస్ షిప్‌, ఏపీ స్కిల్‌ డెవలప్ మెంట్‌ కార్పొరేషన్‌, వివిధ బీసీ సమాఖ్యలు... ఇలా పలు విభాగాలు ఇప్పటికే అందిస్తున్న శిక్షణ కార్యక్రమాల్లో నుంచి à°’à°• దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. à°† తర్వాత అర్హులైన వారి వివరాలు, వారు ఎంచుకున్న శిక్షణ రంగాలను జిల్లాల వారీగా... డీఆర్‌డీఏ పీడీలకు పంపిస్తారు. ఏ జిల్లాకు à°† జిల్లాలో నెల రోజులపాటు శిక్షణ ఏర్పాటు చేస్తారు. శిక్షణ కోసం ఒక్కో అభ్యర్థికి రూ.12వేలు ఖర్చు చేయనున్నారు. దీన్ని ప్రభుత్వమే భరిస్తుంది. à°ˆ శిక్షణ కోసం రూ.1472 కోట్లను ప్రభుత్వం ఖర్చుచేయనుంది.
 
 
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా
మరోవైపు రాష్ట్రంలో రాబోయే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగ భృతి తీసుకుంటున్న యువతను తీర్చిదిద్దుతారు. పరిశ్రమల అవసరాలు తెలుసుకుని... వారి ఉద్యోగావసరాలకు తగిన శిక్షణ ఇస్తారు. అదేసమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థలు, కంపెనీలు, పరిశ్రమల్లో అప్రెంటిస్ షిప్ à°—à°¾ కూడా వీరిని ఎంపిక చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. మరోవైపు నిరుద్యోగ భృతికోసం ఏర్పాటుచేసే ప్రత్యేక వెబ్‌పోర్టల్‌లోనే... భవిష్యత్తు ఉద్యోగావకాశాల సమాచారం కూడా అందిస్తారు.