ఎన్నికల హామీపై వడివడిగా అడుగులు

Published: Thursday August 02, 2018
అమరావతి,: à°°à±ˆà°¤à±à°² వ్యవసాయ రుణాల మాఫీని à°ˆ ఏడాది డిసెంబరులోగానే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. 2014 ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని ఒక్కో రైతుకు రూ.లక్షన్నర వరకు రుణాలను మాఫీ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా ఆయన అధికారంలోకి రాగానే రూ.50 వేలలోపు ఉన్న రుణాలను ఏకమొత్తంగా మాఫీ చేశారు. మిగిలిన బకాయిను 5 విడతల్లో మాఫీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికి 3 విడతల రుణమాఫీ జరిగింది. 10% వడ్డీతో కలిపి మాఫీని వర్తింపజేశారు.
 
నాలుగో విడత మాఫీకి à°ˆ ఏడాది బడ్జెట్‌లో రూ.4,100 కోట్లు కేటాయించారు. అయితే, వచ్చే ఏడాది ఎన్నికల సమయం కావడంతో ఐదో విడతను కూడా à°ˆ ఏడాది చివరిలోనే ఇచ్చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నాలుగో విడతకు బడ్జెట్‌లో నిధులు కేటాయించగా, ఐదో విడతకు అవసరమైన నిధులను ప్రణాళికేతర వ్యయంగా తీసుకుని, రుణమాఫీ ఒకేసారి పూర్తిచేయాలని యోచిస్తోంది. 3విడతలు మాఫీ పొందిన రైతుల à°–à°¾ తాల్లో ఉన్న బాకీల్లో చిన్న మొత్తాలను ఒకసారి, మిగిలిన మొత్తాన్ని మరోసారి మాఫీ చేయనున్నారు. 10ువడ్డీతో కలిపి 2నెలల వ్యవధిలో మొత్తం బకాయి మాఫీ చేసేలా జాబితాలు సిద్ధమౌతున్నాయి.
 
 
భారం రూ.24,540 కోట్లు
రుణాల మాఫీకి ప్రభుత్వం దాదాపు రూ. 24,540కోట్ల ఆర్థిక భారాన్ని భరించాల్సి వస్తోందని తేలింది. 2014లో చంద్రబాబు ప్రకటించిన వి ధంగా తొలివిడత 54.98లక్షల మంది రైతులకు రూ.7,565కోట్లు మాఫీ చేశారు. అందులో రూ.50 వేల బకాయి ఉన్న 23.76లక్షల మంది రైతులకు రుణ ఉపశమన పథకం కింద రూ.4,493కోట్లతో ఏక మొత్తంగా మాఫీ చేశారు. అలాగే 2.23లక్షల మంది ఉద్యాన పంటల రైతులు రూ.385కోట్లు చెల్లించారు. రెండో విడత రుణ మాఫీలో 10% వడ్డీతో 36.39లక్షల మంది రైతులకు రూ.3,303 కోట్లు, మూడో విడత 10% వడ్డీతో 36.68లక్షల మంది రైతులకు రూ.3,630కోట్లు జమ చేశారు. రైతు సాధికార సంస్థకు అందిన అర్జీలను పరిశీలించి, మరో రూ.156కోట్లు ఇచ్చారు. ఇప్పటి వరకు మొత్తం రూ.15,040కోట్లను మాఫీ చేయగా, 4, 5 విడతల మాఫీ కింద 10ు వడ్డీతో కలిపి మరో రూ.9,500 కోట్లు వెచ్చించనుంది.