మహా సంప్రోక్షణకు నేడు అంకురార్పణ తిరుమలలో ఏర్పాట్లు పూర్తి

Published: Saturday August 11, 2018
శ్రీవెంకటేశ్వరుడి ‘పుష్కర సేవ’కు సర్వం సిద్ధమైంది. ఆదివారం నుంచి ఈనెల 16à°µ తేదీ గురువారం వరకు ఆగమోక్తంగా ‘మహా సంప్రోక్షణ’ జరగనుంది. శనివారం అంకురార్పణతో à°ˆ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కానుంది. ఆదివారం నుంచి ఆలయ యాగశాలలో ఐదు రోజుల పాటు నిర్వహించే క్రతువులో ప్రధానార్చకులు వేణుగోపాలదీక్షితులు ఆధ్వర్యంలో 45మంది రుత్వికులు, వందమంది వేదపండితులు, 20మంది వేదపాఠశాల విద్యార్థులు పాల్గొంటారు. à°ˆ కార్యక్రమంలో భాగంగా ఆనందనిలయంలో వెంకటేశ్వరస్వామి కొలువైన పీఠాన్ని అష్టవిధ ద్రవ్యాలతో బలోపేతం చేస్తారు. స్వామివారి దివ్య తేజస్సును కలశంలో ఆవహించేలా చేస్తారు. గర్భాలయంలో, ఇతర కీలక ప్రాంతాల్లో అవసరమైన మరమ్మతులు కూడా చేస్తారు.
 
మూడు రాష్ర్టాల నుంచి రుత్వికులు
మహత్తర క్రతువైన మహా సంప్రోక్షణ శాస్ర్తోక్తంగా జరిపించేందుకు మూడు రాష్ట్రాల నుంచి 30 మంది రుత్వికులను ఆహ్వానించారు. టీటీడీకి చెందిన అనుభవం కలిగిన మరో 14 మంది అర్చకులు కూడా రుత్వికులుగా వ్యవహరించనున్నారు. రుత్వికుల స్థాన నిర్ణయాన్ని శనివారం అంకురార్పణ సందర్భంగా శ్రీనివాసుడి సమక్షంలో నిర్ణయిస్తారు. ఈ ప్రక్రియను ఆచార్యవరణం అంటారు. ప్రధానాచార్యుడు, రుత్వికులు, వైఖానస పరిచారకులు యాగశాలలో ఏర్పాటు చేసిన 28 హోమగుండాల వద్ద తమ తమ బాధ్యతలు నిర్వహిస్తారు. అలాగే యాగశాల ప్రాంగణంలో వేదపారాయణదారులు వేదమంత్రాలు, చతుర్వేద పారాయణం చేస్తారు. పురాణపండితులు మహాభారతం, రామాయణం, భగవద్గీత పారాయణం చేస్తారు. దివ్య ప్రబంధనదారులు ప్రబంధాలను పఠనం చేస్తారు. ఈ ప్రక్రియంతా ఓ దీక్షలా జరుగుతుంది.
 
రుత్వికులకు బంగారు రక్షాబంధనం
సంప్రోక్షణ ప్రారంభయ్యే మొదటిరోజు ఆదివారం ఉదయం 6 గంటలకు ఆలయంలో హోమగుండాలు వెలిగిస్తారు. ఆ తర్వాత పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, వాస్తుహోమం నిర్వహిస్తారు. అనంతరం మహాసంప్రోక్షణ జరిగినన్ని రోజులు రుత్వికులు రక్షాబంధనం ధరించాలి. ఈసారి టీటీడీ సుమారు 2 గ్రాముల బరువైన బంగారు రక్షాబంధనం చేయించింది.