శ్రీవారి ఆలయంలో ఆగమోక్తంగా క్రతువు

Published: Monday August 13, 2018
 à°¤à°¿à°°à±à°®à°² శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. ముందుగా నిర్ణయించిన సమయానికి ప్రధాన అర్చకులు, రుత్వికులు à°ˆ క్రతువును ఆగమోక్తంగా మొదలుపెట్టారు. వేకువజామున అర్చక నిలయం నుంచి రుత్వికులు బయలుదేరి ఆలయ సన్నిధిలోకి చేరుకుని మూలవర్లను ఆరాధించారు. ఉదయం 6 గంటలకు యాగశాలలో ప్రవేశించి వాస్తుహోమం కోసం దర్భకర్రకు వాస్తుపురుషుడిని ఆవాహనం చేసుకుని ఆవాహనీయం గుండాన్ని వెలిగించారు. దర్భకర్రను అన్ని హోమగుండాలను తాకించారు. అనంతరం విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం చేసి కంకణాలు ధరించారు.
 
ఆచార్య రుత్వికులకు దోషాలేవైనా ఉంటే హరింప చేయడానికి పౌండరీకం గుండాన్ని వెలిగించి అకల్మష హోమం చేశారు. పంచగవ్యప్రాశన ఆరాధన చేసి తీర్థాన్ని సేవించారు. ఆ తర్వాత ప్రధాన అర్చకులు, టీటీడీ ఈవో, రుత్వికులు స్వర్ణ రక్షాబంధనాలను ధరించి ప్రార్థనలు చేయడంతో ప్రాతఃకాల కైంకర్యం ముగిసింది. సాయంత్రం 6గంటలకు రుత్వికులు ఆలయ యాగశాలకు చేరుకుని యథావిధిగా క్రతువును మొదలుపెట్టారు. అన్ని హోమగుండాలకు అగ్నిప్రతిష్ఠ చేసిన తర్వాత ఆచార్య రుత్వికులు కుంభాలను చేతబట్టి విమానం, జయవిజయ, గరుత్మంతుడు, వరదరాజస్వామి, విష్వక్సేన, భాష్యకారులు, వేణుగోపాలస్వామి, యోగనరసింహస్వామి, వకుళమాత, ధ్వజస్తంభం, బేడి ఆంజనేయస్వామి ఆలయాలకు చేరుకుని ధ్యానం చేస్తూ కళాశక్తుల్ని కుంభంలోకి ఆవాహనం చేసుకున్నారు.
 
ఇక, సన్నిధిలోకి ప్రధాన అర్చకులైన వేణుగోపాలదీక్షితులు, రుత్వికులు చేరుకుని ‘దేవదేవా à°ˆ దేవాలయం.. నీ గృహం పాతబడింది. దీన్ని తిరిగి సిద్ధం చేసేవరకు, పునఃప్రతిష్ట జరిగే దాకా à°ˆ కుంభంలో నివసించు. మాపట్ల అనుగ్రహం చూపించు’ అంటూ మూలమూర్తి, ఉత్సవమూర్తుల శక్తులను ప్రధాన కుంభంలోకి ఆవాహన చేసుకున్నారు. మూలమూర్తి తల, నుదురు, ముక్కు, నోరు, గొంతు, రెండు భుజాలు, హృదయం, నాభి, à°•à°Ÿà°¿, మోకాళ్లు, పాదాల్లో 12జీవస్థానాలు ఉంటాయి. ఒక్కో జీవస్థానానికి 4చొప్పున మొత్తం 48కళలుంటాయి. వీటన్నింటినీ కుంభంలోకి ఆవాహన చేశారు. à°† బింబాలను యాగశాలలో 18 వేదికలపై కొలువుదీర్చి ఆరాధన, నివేదనలు సమర్పించి విశేషంగా హోమం, యజ్ఞాదులను నిర్వహించారు. కుంభంలోకి కళాకర్షణ, శక్త్యాకర్షణ జరిగాక గర్భాలయంలోని ధృవభేరం కేవలం శిలా ప్రతిమగానే భక్తులకు దర్శనమిచ్చారు. à°† దైవం శక్తి మొత్తం కుంభంలో నిక్షిప్తమై ఉంటుంది. ఆలయ నవీకరణ జరిగే వరకు నిత్యపూజలు, ఉత్సవాలు, సేవలు అన్నీ బాలాలయంలోనే కొనసాగుతాయి.