ఉచిత వై ఫై సేవలు 500 గ్రామాలకు ప్రారంభం
Published: Friday November 17, 2017

కర్ణాటకలోని 500 గ్రామాలకు ఉచిత వై ఫై సేవలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,560 గ్రామ పంచాయతీలకు ఈ సేవలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం జరిగిన బెంగళూరు టెక్నాలజీ సమ్మిట్‌లో మొదట 500 గ్రామాలకు ఉచిత వై ఫై సేవలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రారంభించారు. ఈ గ్రామస్థులు తమ ఇళ్ళ నుంచే ఈ సేవలను వినియోగించుకోవచ్చు.
గత నవంబరులో ప్రయోగాత్మకంగా 11 గ్రామాలకు ఉచిత వై ఫై సేవలను అందించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 2,560 గ్రామాలకు ఈ పథకాన్ని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది

Share this on your social network: