నిఘా నీడలో ఎర్రకోట..

Published: Wednesday August 15, 2018
న్యూఢిల్లీ: à°¸à±à°µà°¾à°¤à°‚త్ర్య దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పంద్రాగస్టు ప్రసంగం నేపథ్యంలో... ఎన్ఎస్‌జీ కమెండోలు, వేలాదిమంది భద్రతా సిబ్బంది నిత్యం ఎర్రకోటపై నిఘా వేసి ఉంచారు. దీనికి అదనంగా కోట లోపల 500 అత్యాధునిక సీసీకెమేరాలు, కైట్ క్యాచర్లను ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన 36 మంది స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ (స్వాట్) మహిళా కమెండోలు వేదిక వద్ద పహారా కాస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
 
దేశ వ్యాప్తంగా ఇవాళ 72వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో.. ఢిల్లీలోని దాదాపు 70 వేలమంది పోలీసు సిబ్బంది అడుగడుగునా గస్తీ కాస్తున్నారు. ఒక్క ఎర్రకోట వద్దే 10 వేలమంది పోలీసులు మోహరించడం విశేషం. సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులు, విదేశీ ప్రతినిధులు, ప్రజలు ప్రధాని ప్రసంగం వినేందుకు రానుండడంతో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. 2019లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో ప్రధాని మోదీకి ఇదే చివరి పంద్రాగస్టు ప్రసంగం కానుంది.