ఎన్టీఆర్‌కు అండదండలు.. హైటెక్‌ సిటీ ప్రారంభించింది ఆయనే

Published: Friday August 17, 2018

ఆంధ్రప్రదేశ్‌ అంటే ఎంతో అభిమానం! రాష్ట్రానికి సహాయం చేయడంలో ఉదారత! చంద్రబాబు అంటే ప్రత్యేకమైన వాత్సల్యం!... ఇది వాజ్‌పేయికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో ఉన్న అనుబంధం! ప్రధాని కావడానికి ముందు, ప్రధాని అయ్యాక ఆంధ్రప్రదేశ్‌తో వాజపేయి సంబంధాలు ఆపేక్షాపూరితంగా కొనసాగాయి. మొదట్లో ఏపీతో వాజ్‌పేయికి పెద్దగా పరిచయం ఉండేదికాదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత పరిస్థితి మారింది. ఎన్టీఆర్‌ను 1984లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ముఖ్యమంత్రి పదవి నుంచి దించిన సందర్భంలో జాతీయ స్థాయిలో అంకురార్పణ చేసిన ఆయన ఎల్‌బీ స్టేడియంలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు. అంతకుముందు, 1998లో ప్రతిష్ఠాత్మక హైటెక్‌ సిటీ(సైబర్‌ టవర్స్‌) ప్రారంభోత్సవానికి వాజ్‌పేయి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎంఎంటీఎస్‌, గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు(శంషాబాద్‌ విమానాశ్రయం) మంజూరు చేసిన ఘనత వాజ్‌పేయిదే. ఎన్టీఆర్‌, చంద్రబాబులతో సాన్నిహిత్యం ఉన్న వాజ్‌పేయి.. 2000 జూన్‌లో ఇండో-అమెరికన్‌ కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌, రీసెర్చి సెంటర్‌ ప్రారంభోత్సవానికి హాజరై తన అభిమానాన్ని చాటుకున్నారు. అంతకుముందు 1984లో వాజ్‌పేయి రెండుసార్లు హైదరాబాద్‌ వచ్చారు. అప్పట్లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని గవర్నర్‌ అక్రమంగా బర్తరఫ్‌ చేయగా, జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి వాజ్‌పేయి à°…à°‚à°¡à°—à°¾ నిలిచారు. ఎన్టీఆర్‌ తిరిగి ముఖ్యమంత్రి కాగా.. ప్రమాణ స్వీకారానికి ఎల్బీ స్టేడియంలో ఏర్పాటుచేసిన సభకు వాజ్‌పేయి హాజరయ్యారు. ‘సొంత పార్టీ ముఖ్యమంత్రులకన్నా చంద్రబాబే వాజపేయికి ప్రియతముడిగా మారారు’... ఇది గతంలో బీజేపీ నేతలు అంతర్గతంగా చెప్పుకొన్న మాట! అది అక్షరాలా నిజం. తాను ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఏ ప్రతిపాదన వచ్చినా వాజ్‌పేయి వెంటనే ఆమోద ముద్ర వేసేవారు. కేంద్రంపై అనుచితమైన ఒత్తిడి తేకుండా, ప్రధానిని ఇబ్బంది పెట్టకుండా చంద్రబాబు వ్యవహరించేవారు. జాతీయ స్థాయిలో ఇన్స్యూరెన్స్‌ రెగ్యులేటరీ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని ముంబైలో పెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. దానిని హైదరాబాద్‌కు తరలించారు.