తిరుమల క్షేత్రంలో అనాథగా ...మారిన పాప...

Published: Sunday August 19, 2018

పాలుగారే బుగ్గలు.. లోకాన్ని చూసేందుకు ఇంకా సరిగా తెరచుకోని కళ్లు.. నేలతల్లి ఒడిలోకి వచ్చి రోజులైనా గడవని à°† పసికందుకు పెద్ద శిక్షే పడింది. పుట్టీపుట్టకనే అనాథగా మారిపోయింది. తిరుమల క్షేత్రంలో శనివారం రాత్రి à°ˆ ఘటన చోటుచేసుకుంది. నవమాసాలు మోసి కన్న తల్లికి ఏ కష్టమొచ్చిందో, తండ్రి ఉన్నాడో లేదో తెలీదు కాని à°† పసిపాప మాత్రం ఒంటరిదైపోయింది. సుమారు పదిరోజుల వయస్సున్న చిన్నారి రాత్రి 8 à°—à°‚à°Ÿà°² సమయంలో కల్యాణకట్ట ఎదురుగా ఉన్న షెడ్‌లో ఏడుస్తుండగా పారిశుధ్య కార్మికులు గుర్తించి విజిలెన్స్‌ అధికారులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న విజిలెన్స్‌ సిబ్బంది చిన్నారిని దగ్గరలోని హెల్త్‌ డిస్పెన్సరీకి తరలించారు. పాప ఆరోగ్యంగానే ఉందని తెలియటంతో à°† తర్వాత స్థానిక అశ్విని ఆస్పత్రికి తరలించారు. కాగా, పాపను ఎవ్వరు వదిలిపెట్టి వెళ్లారనే అంశంపై విజిలెన్స్‌ అధికారులు విచారణ చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఆడపిల్ల కావటంతో వదలిపెట్టారేమో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.