సగం సీజన్‌ పూర్తయినా.. కనికరించని బ్యాంకర్లు

Published: Monday August 20, 2018
: à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో పంట రుణాల పంపిణీ నత్తనడకన సాగుతోంది. ఖరీఫ్‌ సీజన్‌ మొదలై రెండున్నర నెలలు గడిచినా కొన్ని జిల్లాల్లో 40నుంచి 60% మంది రైతులకు ఇంకా పంట రుణాలు అందలేదు. ఖరీఫ్‌లో 13 జిల్లాల్లో రూ.59,031 కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ధేశించగా, ఇప్పటికి రూ.35,869 కోట్లు (61%) మాత్రమే పంపిణీ చేశారు. ఇందులో స్వల్పకాలిక పంట రుణాల à°•à°¿à°‚à°¦ రూ.45,749 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, రూ.30042 కోట్లే (66%) ఇచ్చారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో దీర్ఘకాలిక రుణాల à°•à°¿à°‚à°¦ రూ.13,282 కోట్లు ఇవ్వాలని నిర్ణయించగా, రూ.5828 కోట్లే (44%) పంపిణీ చేశారు. దీర్ఘకాలిక రుణాల్లో 68% పంపిణీతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా, అనంతపురం జిల్లాలో రూపాయి కూడా ఇవ్వలేదు. పంట రుణాలు అనంతపురంలో 102% పంపిణీ చేయగా, విజయనగరంలో 43% మాత్రమే ఇచ్చారు. పశ్చిమ గోదావరి, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో రుణాల పంపిణీ 50% దాటలేదు. ఖరీఫ్‌ సాగు విస్తీర్ణంలో 155 కూడా లేని à°•à°¡à°ª జిల్లాలో 65% రుణాలు ఇచ్చారు. వరి సాగు జోరుగా సాగుతున్న తూర్పుగోదావరిలో 55%, శ్రీకాకుళంలో 60% పంపిణీ జరిగింది. అన్నిరకాల పంటలు పండే గుంటూరులో 55-57% రుణాలిచ్చినట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి.
 
 
కౌలు రైతుకూ కష్టాలే!
à°ˆ ఏడాది కౌలు రైతులకు రూ.7500 కోట్ల రుణం ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయించినా, ఇప్పటి వరకు రూ.2061 కోట్లే ఇచ్చారు. రుణ అర్హత కార్డు(ఎల్‌ఈసీ), సాగు ధ్రువపత్రం(సీఈసీ) ఉన్నా.. భూ యజమాని లోన్‌ తీసుకున్నారంటూ, కౌలుదారులకు రుణాలివ్వడం లేదు. గతేడాది తీసుకున్న వడ్డీలేని రుణాలను తిరిగి చెల్లించిన వారికీ, రూ.3లక్షల లోపు రుణాలు తీసుకుని, సకాలంలో వడ్డీతో సహా చెల్లించిన రైతులకూ రుణాలిస్తున్నారు.
 
 
రుణమాఫీ ఖాతాలు అంతే!
రుణమాఫీ ప్రక్రియలోనూ బ్యాంకర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీకి అర్హత ఉన్నా, చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన à°“ రైతుకు మాఫీ వర్తింపజేయడంలో à°’à°• బ్యాంకరు శ్రద్ధ చూపడం లేదు. 2012లో రూ.55వేలు రుణం తీసుకున్న సన్నకారు రైతు అకౌంట్‌ వివరాలను రైతు సాధికార సంస్థకు పంపడంలో తాత్సారం చేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలానికి చెందిన à°“ మహిళా రైతు బకాయి రూ.55వేలు ఉంటే, మొదటి వాయిదా జమ అయినా, రెండు, మూడు విడతల సొమ్ము ఇంతవరకు పడలేదు. బ్యాంకరును అడిగితే సాధికార సంస్థ నుంచి డబ్బులు రాలేదంటున్నారు. à°† సంస్థను సంప్రదిస్తే, మేం ఎప్పుడో పీడీ ఖాతాలకు పంపామని చెబుతున్నారు. à°† మహిళా రైతు బ్యాంకుకు, సాధికార సంస్థ చుట్టూ పదేపదే తిరుగుతున్నా ఇప్పటికీ ఫలితం లేదు. ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు రైతుల ఖాతాలకు మూడో విడత రుణమాఫీ సొమ్ము ఇంకా జమ కాలేదు. బ్యాంకర్లను అడిగితే రైతులు రుణ ఉపశమన పత్రాలను అప్‌లోడ్‌ ఆలస్యం అవుతుందంటున్నారు