గుడికెళ్లే భక్తులకు నరకమే..

Published: Tuesday August 21, 2018
దుర్గమ్మను దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు నిలువ నీడ కరువైంది. ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంలో తడుస్తూనే భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సాధారణ రోజుల్లో సగటున 25వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. శుక్ర, ఆదివారాల్లో à°† సంఖ్య రెట్టింపవుతుంది. దసరా ఉత్సవాలు, భవానీ దీక్షల విరమణ, ఇతర ఉత్సవ సమయంలో లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. à°ˆ ఏడాది దసరా ఉత్సవాలు దగ్గర పడుతున్నాయి. 5 లక్షల మందికి పైగా వస్తారని అంచనా. ఏటా భక్తులు పెరుగుతున్నా అందుకు తగిన వసతులు మాత్రం కనిపించడం లేదు. క్యూలైన్ల వద్ద తాత్కాలికంగాతాటాకులు, గ్రీన్‌క్లాత్‌తో పందిళ్లు ఏర్పాటుచేశారు. భారీ వర్షాలకు అవి ఏమాత్రం అక్కరకు రావట్లేదు.
 
 
ఆకలేస్తే ఆరుబయటే..
దర్శనానంతరం భక్తులు సేదతీరేందుకు, భోజనం చేసేందుకు ఎక్కడా చోటు లేదు. మహామండపం దిగువన చెప్పుల స్టాండు ఉన్న షెడ్డులో కింద కూర్చుని వర్షంలో తడుస్తూనే భోజనాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. క్యూలైన్లలో గంటల తరబడి నిలబడుతున్న భక్తులు, వృద్ధులు కళ్లుతిరిగి పడిపోవడం, స్వల్ప అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటం జరుగుతోంది. అత్యవసరంగా ప్రాథమిక చికిత్స అందించే ఏర్పాట్లు కూడా లేవు. కేవలం మహామండపం ఏడో అంతస్థులో మాత్రమే ప్రాథమిక చికిత్స కేంద్రం ఉంది.
 
 
మెట్లపూజ చేస్తే ముక్కు మూసుకోవాల్సిందే..
ఆలయానికి వచ్చే భక్తుల్లో చాలామంది మెట్లకు పూజ చేసి మొక్కు తీర్చుకుంటారు. మహామండపం దిగువ నుంచి కొండపైకి ఉన్న సుమారు 215 మెట్లకు మహిళా భక్తులు పసుపు, కుంకుమ, తమలపాకులు, కర్పూరం, కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తుంటారు. సొరంగంలా ఉన్న à°ˆ మార్గంలో మహామండపం పై అంతస్థుల నుంచి చెత్తాచెదారాలను, ఇతర వ్యర్థాలను పడేస్తున్నారు. దీంతో à°† ప్రాంతం డంపింగ్‌ యార్డులా తయారవుతోంది. వర్షాలకు తడుస్తున్న వ్యర్థాలు కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. మహామండపంలోని మరుగుదొడ్ల డ్రెయినేజీ à°ˆ మెట్ల మార్గం పక్క నుంచి వెళుతుండటంతో భరించలేని దుర్గంధం భక్తులను ఇబ్బందికి గురిచేస్తోంది.
 
 
కుక్కలు బాబోయ్‌..!
ఇంద్రకీలాద్రిపై భక్తుల మధ్య కుక్కలు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. వాటిని చూసిన భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. క్యూ లైన్లలో, మెట్ల మార్గంలో, ఇతర ప్రాంతాల్లో శునకాలు ఎక్కువగా ఉన్నాయి.
 
 
వసతీ భిక్షాందేహి..!
కొండపై పార్కింగ్‌ సమస్య నానాటికీ తీవ్రమవుతోంది. కొండపైన ఘాట్‌రోడ్డులో, దిగువన కనకదుర్గానగర్‌లో పార్కింగ్‌ ఏర్పాటుచేశారు. శుక్రవారం, ఆదివారాలతోపాటు వివిధ ఉత్సవాలు, పండుగ రోజుల్లో వాహనాలు నిలుపుకోవడం ఇబ్బందిగా ఉంటోంది. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వాహనాలను ఎక్కడ పార్క్‌ చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు భక్తులు కెనాల్‌ రోడ్డులో పార్కింగ్‌ చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయి. దత్తతాలయమైన శనైశ్చరస్వామి ఆలయం ఎదురుగా ఉన్న స్థలంలో, కుమ్మరిపాలెం సెంటర్‌లోని టీటీడీ దేవస్థానానికి చెందిన 5 ఎకరాల ఖాళీస్థలంలో ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది.
 
 
సూచికలెక్కడ?
ఆలయంలో సూచిక బోర్డులు లేక దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అయోమయానికి గురవుతున్నారు. అంతరాలయం వైపునకు, సెల్‌ఫోన్లు, చెప్పులు, సామాన్లు భద్రపరుచుకునే కౌంటర్లు, మరుగుదొడ్లు, ప్రసా దాలు, చీరల కౌంటర్లు, పూజ టికెట్ల విక్రయ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సమాచార కేంద్రం ఎక్కడున్నాయో వెతుక్కోవాల్సిందే.
 
 
కను‘మరుగు’ దొడ్లు
భక్తులకు తగిన సంఖ్యలో మరుగుదొడ్లు అందుబాటులో లేవు. మహామండపంలో మరుగుదొడ్లు ఉన్నా వాటిపై అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో అధ్వానంగా ఉన్నాయి. వాటిలోకి వెళ్లాలంటేనే భక్తులు భయపడుతున్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న మరుగుదొడ్ల పరిస్థితి కూడా అంతే. మల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న మరుగుదొడ్లు సిగరెట్‌ ప్యాకెట్లు, ఇతర వ్యర్థాలతో నిండిపోయాయి. వాటి పరిస్థితిని చూసిన భక్తులు వెనుదిరిగి వచ్చేస్తున్నారు. పుష్కరాలకు మహామండపం దిగువన ఉన్న ఖాళీస్థలంలో ఏర్పాటుచేసిన తాత్కాలిక మరుగుదొడ్లు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతో వాటి పక్కనే ఉన్న ఖాళీస్థలంలో బహిరంగ మూత్రవిసర్జన చేస్తున్నారు. మహిళా భక్తుల పరిస్థితి మరీ దారుణం. ఆలయంలో పారిశుధ్య పరిస్థితులు కూడా అధ్వానంగా ఉన్నాయి.
 
 
ప్రసాదం కౌంటర్లలోనూ మోసమే
అమ్మవారి దర్శనం అనంతరం లడ్డూ ప్రసాదం విక్రయిస్తున్న కౌంటర్లలో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. నేను రూ.100 ఇచ్చి ఆరు లడ్లు, రెండు పులిహోర ప్యాకెట్లు ఇమ్మంటే.. నాకు హడావుడిగా ఐదు లడ్లు, 2 పులిహోర ప్యాకెట్లు మాత్రమే ఇచ్చారు. ఇదేంటని అడిగితే దురుసుగా సమాధానం చెబుతున్నారు.- మస్తాన్‌రావు, భక్తుడు, గుంటూరు
 
 
వసతులు కల్పిస్తే బాగుంటుంది
దుర్గమ్మ దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆలయ అధికారులు తగిన వసతులు కల్పిస్తే బాగుంటుంది. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వస్తే కనీసం నిలబడటానికి కూడా నీడ లేకపోవడం బాధాకరం. దర్శనం చేసుకున్న భక్తులు కాసేపు కూర్చుని సేదతీరేందుకు కూడా చోటులేదు. - లక్ష్మణ్‌, రాజమండ్రి
 
 
సూచిక బోర్డులు ఏర్పాటుచేయాలి
దూరం నుంచి వస్తున్న భక్తులు కనీసం మరుగుదొడ్లకు ఎటు వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఆలయంలో ఏది ఎక్కడ ఉందో సూచిస్తూ బోర్డులు ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుంది. ఇలాంటి చిన్నచిన్న సౌకర్యాలు కల్పించడంలో కూడా ఆలయ అధికారులు విఫలమవుతుండటం దురదృష్టకరం. - మన్నే రాజా, దివ్యాంగుడు, గోకవరం