ప్రకాశం బ్యారేజీకి పూర్తిగా తగ్గిన ఇన్‌ఫ్లో.

Published: Friday August 24, 2018

 à°ªà±à°°à°•à°¾à°¶à°‚ బ్యారేజీకి ఇన్‌ఫ్లో పూర్తిగా తగ్గిపోయింది. దీంతో అధికారులు బ్యారేజీ గేట్లను మూసివేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో నిన్నటి వరకు వరద ఉధృతంగా ఉండడంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు. కాగా... ప్రస్తుతం వరద ప్రవాహం తగ్గిపోవడంతో శుక్రవారం ఉదయం గేట్లను మూసివేశారు. కాగా... కృష్ణా తూర్పు డెల్టాకు 8,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా పశ్చిమ డెల్టాకు 6,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.