కాంగ్రెస్‌, వైసీపీ, జనసేన మద్దతు

Published: Sunday September 02, 2018
సీపీఎస్‌పై ఉద్యోగులు సమరభేరి మోగించారు. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు గుదిబండగా మారిన సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్‌ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ ఉద్యోగుల సంఘం (ఏపీసీపీఎ్‌సఈఏ) డిమాండ్‌ చేసింది. ఇందుకు అక్టోబరు 2à°µ తేదీ వరకు గడువు విధించింది. à°† తేదీలోగా జీవో నంబర్లు 653, 654, 655 ఉపసంహరించుకోకపోతే అక్టోబరు 10 నుంచి ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతామని సభ హెచ్చరించింది. ‘వార్‌ ఫర్‌ పెన్షన్‌-ఓట్‌ ఫర్‌ పెన్షన్‌’ నినాదంతో ఏపీసీపీఎ్‌సఈఏ శనివారం విజయవాడలో భారీ ప్రదర్శన చేపట్టింది.టీచర్లు, ఉద్యోగులు జిల్లాల్లో కలెక్టరేట్లను ముట్టడించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షన్నర మంది ఉద్యోగులు, టీచర్లు శనివారం సామూహిక సెలవుపెట్టి మరీ ఆందోళనల్లో పాల్గొన్నారు. సీపీఎ్‌సను రద్దు చేయించుకోకుండా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవాడ రైల్వే స్టేషన్‌ నుంచి గాంధీనగర్‌లోని జింఖానా గ్రౌండ్స్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
 
13 జిల్లాల నుంచి తరలివచ్చిన వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు కదంతొక్కారు. అనంతరం అసోసియేషన్‌ అధ్యక్షుడు పాలెపు రామాంజనేయులు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, వైసీపీ నాయకులు కొలుసు పార్థసారథి, మల్లాది విష్ణు, జనసేన అధికార ప్రతినిధి చింతల పార్థసారథి, అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అటు జిల్లాల్లోనూ కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయులు సీపీఎస్‌ రద్దు కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేశారు. 6 నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో సీపీఎస్‌ రద్దుపై తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపాలని డిమాండ్‌ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ప్రధాన ద్వారాలు మూసివేసి.. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం à°’à°‚à°Ÿà°¿à°—à°‚à°Ÿ వరకు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం చర్చి సెంటర్‌లో మానవహారం నిర్వహించి.. రాస్తారోకోకు ప్రయత్నించారు.
 
సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖలోనూ కలెక్టరేట్‌ ముట్టడికి ఉద్యోగులు, టీచర్లు ప్రయత్నించారు. పోలీసులు విఫలం చేశారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రత్యేక వాహనాల్లో పోలీసు స్టేషన్లకు తరలించి.. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. గుంటూరులో ఫ్యాప్టోకు చెందిన వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. దీంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు రంగప్రవేశం చేసి.. ఆందోళన విరమించాలని కోరినా నేతలు వినిపించుకోలేదు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ముట్టడిలో పాల్గొన్న ఫ్యాప్టో చైర్మన్‌ పి.బాబురెడ్డి మాట్లాడుతూ.. సీపీఎ్‌సను రద్దు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జేఏసీ సెక్రెటరీ జనరల్‌ సీహెచ్‌ సుఽధీర్‌బాబు మాట్లాడుతూ .. ప్రజాప్రతినిధులకు పెన్షన్‌ ఉందని, ఉద్యోగులకు పెన్షన్‌ రద్దు చేయడమేమిటని విమర్శించారు. శ్రీకాకుళంలోనూ కలెక్టరేట్‌ ముట్టడి జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
కర్నూలులో ఫ్యాప్టో సెక్రెటరీ జనరల్‌ జి.హృదయరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం ఉద్యోగులపై నిర్లక్ష్యాన్ని తెలుపుతోందని.. అన్ని రాజకీయ పార్టీలు సీపీఎ్‌సపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కృష్ణా జిల్లాలో ఫ్యాప్టో కోఛైర్మన్‌ పాండురంగవరప్రసాద్‌, పి.కృష్ణయ్య, డిప్యూటీ సెక్రెటరీ జనరల్‌ సి.హెచ్‌.శరత్‌చంద్ర, కార్యదర్శి యం.బాబూ రాజేంద్రప్రసాద్‌, ఏపీసీపీఎస్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి సి.à°Žà°‚.దా్‌సతో పాటు వేల మంది ఉపాధ్యాయులు పాల్గొని అరెస్టయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కలెక్టరేట్‌ గేట్లు మూసి ఉండడంతో టీచర్లు, ఉద్యోగులు గేట్లు దూకి మరీ లోపలకు దూసుకెళ్లారు. ఆందోళనల్లో నెల్లూరులో ఎమ్మెల్సీ వి.బాలసుబ్రమణ్యం, చిత్తూరులో ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి, కృష్ణా జిల్లాలో ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, అనంతపురంలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి కూడా పాల్గొన్నారు.