నవజాత శిశువుల మృతదేహాలు

Published: Monday September 03, 2018

కోల్‌కతా నగరంలో 14 మంది నవజాత శిశువుల మృతదేహాలు లభ్యం అయిన ఘటన సంచలనం రేపింది.కోల్‌కతా నగరంలోని హర్దీపూర్ ప్రాంతంలోని ఖాళీ స్థలాన్ని శుభ్రం చేస్తున్నకార్మికులకు 14 ప్లాస్టిక్ ప్లాస్టిక్ బ్యాగులు కనిపించాయి. బ్యాగుల్లో ఏముందోనని విప్పిన కార్మికులకు చిన్నారుల మృతదేహాలు కనిపించడం వారు ఆందోళన చెందారు. శిశువుల డైపర్లలో కెమికల్ కనిపించిందని వైద్యులు ప్రకటించారు. డైపర్లలో కెమికల్స్ ఉండటం సంచలనం రేపింది. నవజాత శిశువుల మృతదేహాలు కుళ్లిపోయి ఉండటంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం తరలించారు. అప్పుడే పుట్టిన చిన్నారులను గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేసి ఉంటారని కోల్ కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. à°ˆ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నవజాత శిశువుల మృతదేహాలు లభ్యమైన ఘటనతో కోల్ కతా మేయరు సోవన్ చటర్జీ, ఎంపీ సుభాషిష్, కౌన్సిలర్ సోమ చక్రవర్తిలు సంఘటన స్థలాన్ని సందర్శించారు. నెలలు నిండని శిశువుల మృతదేహాలై ఉంటాయని కొందరు అంటున్నారు.