మోదీ ఫొటోను లారీకి కట్టి..

Published: Wednesday September 05, 2018
విజయవాడ: à°°à°µà°¾à°£à°¾ రంగంపై డీజిల్‌, పెట్రోల్‌ ధరలు భారం మోపటం దారుణమని ఐలా చైర్మన్‌ సుంకర దుర్గా ప్రసాద్‌ అన్నారు. మెకానిక్‌ సంఘం కార్యదర్శి, టీడీపీ అర్బన్‌ కార్యనిర్వాహక కార్యదర్శి గల్లా సదాశివరావు (రవి) ఆధ్వర్యంలో పెట్రో ఉత్పత్తుల పెంపునకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. లారీలకు ముందు భాగంలో మోదీ చిత్రపటాన్ని ఉంచి డీజిల్‌, పెట్రోల్‌తో అభిషేకం చేస్తూ ఆటోనగర్‌ కార్మికులు నిరసన తెలిపారు. అనంతరం దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ మోదీ ప్రమాణ స్వీకారం చేసే నాటికి డీజిల్‌ రూ. 60లు లోపే ఉంది. నాలుగేళ్లలో రూ. 18à°² వరకు పెంచారన్నారు. మెకానిక్‌ సంఘం కార్యదర్శి గల్లా సదాశివరావు మాట్లాడుతూ డీజిల్‌ పెరుగుదలతో వేలాది లారీలు నిలిచి పోయాయన్నారు.
 
ప్రతిరోజు జిల్లాలోని లారీ యజమానులపై రూ. రెండు కోట్లు అదనపు భారం పడుతుందని తెలిపారు. పెట్రోలును జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకపోవటం ఆక్షేపణీయమన్నారు. ఆటో క్లస్టర్‌ డైరెక్టర్‌ బాయన బాబ్జి మాట్లాడుతూ ధరల పెరుగుదల చిన్న పరిశ్రమలపై కూడ తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలను సమర్థించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యలు గర్హణీయమని, ఆయన తన వ్యాఖ్యలు విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. à°ˆ కార్యక్రమంలో మెకానిక్‌ సంఘం అధ్యక్షులు కమ్మిలి సత్యన్నారాయణ, పెయింటర్స్‌ సంఘం అధ్యక్షులు వి.సుబ్బారావు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.