సమస్యలు వింటూ పాదయాత్ర.. ఆరు కి.మీ. నడిచిన జగన్‌

Published: Wednesday September 05, 2018
 à°µà±ˆà°¸à±€à°ªà±€ అధ్యక్షుడు వై.ఎ్‌à°¸.జగన్‌ మంగళవారం ఆరు కిలోమీటర్ల నడిచారు. సోమవారం రాత్రి కింతాడ శివారు రామచంద్రపురంలో బస చేసిన ఆయన.. మంగళవారం ఉదయం 8.50 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. అక్కడ కొందరు అర్చకులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. తాను అధికారంలోకి వస్తే సమస్యలను పరిష్కరిస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. à°—à°¤ మూడు నెలల నుంచి పింఛన్‌ అందడం లేదని గొల్లలపాలేనికి చెందిన à°“ దివ్యాంగురాలు తెలిపారు. తనకు ట్రై సైకిల్‌ ఇప్పించాలని కోరారు. తాను సీఎం అయ్యాక దివ్యాంగుల సమస్యలు పరిష్కరిస్తానని జగన్‌ చెప్పారు.
 
అనంతరం విద్యార్థులు, యువత ఆయనతో సెల్ఫీలు దిగారు. అనంతరం కె.సంతపాలెం, చంద్రయ్యపేట మీదుగా 11 గంటలకు సూదివలస చేరుకున్నారు. అక్కడ కోటపాడు మండలానికి చెందిన టీడీపీ మాజీ సర్పంచ్‌, పలువురు కార్యకర్తలు వైసీపీలో చేరారు. వీరందరికీ జగన్‌ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం భోజన విరామం తీసుకుని తిరిగి మధ్యాహ్నం 2.50à°•à°¿ పాదయాత్రను ప్రారంభించారు. సబ్బవరం మండలం దుడ్డివాక చేరుకున్నారు. పాదయాత్రలో జగన్‌ వెంట స్థానిక ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, వైసీపీ నేతలు గుడివాడ అమరనాథ్‌, రెడ్డి జగన్మోహన్‌, కర్రి సత్యం తదితరులు పాల్గొన్నారు.