సీఎం చంద్రబాబు నిశిత దృష్టి అంటువ్యాధులపైనే.....

Published: Saturday September 08, 2018
అమరావతి: à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లోని వివిధ జిల్లాల్లో వ్యాధులు ప్రబలడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యవేక్షణ చేపట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉంటూనే అంటువ్యాధులపై నిశితంగా దృష్టి సారించారు. అంటువ్యాధులపై అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లు, రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా సీఎం సమీక్షలు చేపట్టారు. టెలికాన్ఫరెన్స్‌à°² ద్వారా అధికారులకు సీఎం పలు మార్గదర్శకాలు చేశారు. ‘ప్రజల్లో సంతృప్తి నిన్న ఎక్కువ ఉండి, ఈరోజు తగ్గడంపై’ సీఎం ప్రశ్నల వర్షం కురిపించారు. à°ˆ నేపథ్యంలో చంద్రబాబు నేరుగా ప్రజల నుంచే రోజువారీ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. అలాగే వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, కలెక్టర్లకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. వైద్య, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధిశాఖలు సమన్వయంగా పనిచేయాలని సీఎం ఆదేశించారు.
 
అంటువ్యాధులు ప్రబలడంపై అధికారులతో సీఎం సమీక్షలు చేపట్టారు. డెంగీ, మలేరియా వ్యాధుల తీవ్రతపై సీఎంవో నిశితంగా దృష్టి సారించింది. ఆయా జిల్లాల్లో పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టింది. రాబోయే రెండు వారాలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, అన్నిచోట్ల పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సురక్షిత తాగునీటిని అందుబాటులో ఉంచాలని, వైద్య శిబిరాలు నిర్వహించాలని మందులు పంపిణీచేయాలని సూచించారు. మురుగు నిల్వలు ఉండరాదని, ఆయా ప్రాంతాలలో బ్లీచింగ్ చల్లాలన్నారు. అలాగే కాచి చల్లార్చిన నీటినే తాగేలా ప్రజలను చైతన్యపరచాలని, వ్యాధినివారణ చర్యలపై అవగాహన కల్పించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచనలు చేశారు.