టెస్ట్‌: వర్షం దెబ్బకు ముందే లంచ్‌బ్రేక్‌ ..

Published: Friday November 17, 2017

కోల్‌కతా: ఈడెన్‌గార్డెన్‌ వేదికగా జరుగుతున్న భారత్‌-శ్రీలంక తొలి తొలిటెస్టుకు వరుణుడు పదేపదే అడ్డు తగులుగుతున్నాడు. రెండో రోజు వర్షం రావడంతో ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు. తేనీటి విరామం లేకుండానే భోజన విరామాన్ని ముందుకు తెచ్చారు.

వర్షంతో మ్యాచ్‌ నిలిచే సమయానికి 32.5 ఓవర్లకు భారత్‌ 5 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. టీమిండియా నయావాల్‌ ఛెతేశ్వర్‌ పుజారా (47; 102 బంతుల్లో 9×4) పట్టుదలతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అర్ధశతకానికి చేరువయ్యాడు. వృద్ధిమాన్‌ సాహా (6; 22 బంతుల్లో 1×4) అతడికి సహకారం అందిస్తున్నాడు. 17/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ 30 పరుగుల వద్ద అజింక్య రహానె (4), 50 వద్ద అశ్విన్‌ (4) వికెట్లు చేజార్చుకుంది.