నిరుద్యోగ భృతి కాదు.. ఎన్నికల భృతి

Published: Friday September 14, 2018
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై వాస్తవిక అంశాలతో ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం ప్రకటించాలని జనసేన పార్టీ నాయకుడు కందుల లక్ష్మీదుర్గేష్‌ డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టు గోడకట్టినా, ఇటుక పేర్చినా, స్పిల్‌వే గ్యాలరీ పూర్తయినా అదేదో ఘనతలా, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసినంత గొప్పగా ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ప్రచారార్భాటాలకు పోవడం సిగ్గుచేటని విమర్శించారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో దుర్గేష్‌ మాట్లాడుతూ టీడీపీ నాయకులు ఎన్నికల సమయంలో 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తామని ఘనంగా చెప్పినా, à°† తర్వాత 2019à°•à°¿ చేస్తామని మాటమార్చారన్నారు. స్పిల్‌వే గ్యాలరీ ప్రారంభోత్సవం పేరుతో సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కుటుంబాలతో సహా విహార యాత్రకు వచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు నిరుద్యోగభృతి ఇస్తామని చెప్పిన మాట తప్పిన బాబుకు ఎన్నికల సమయం వచ్చేసరికి అది గుర్తొచ్చిం దన్నారు. నిజంగా భృతి చెల్లిస్తే à°† నాలుగున్నర సంవత్సరాలకు కూడా లెక్కకట్టి భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
 
అమరావతి బాండ్లకు పది శాతానికి పైగా అత్యధిక వడ్డీ చెల్లించేందుకు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై డిబేట్‌కు మాజీ ఎంపీ ఉండవల్లి ఇచ్చిన పిలుపునకు జనసేన కూడా మద్దతు ఇస్తుందన్నారు. ‘యువనేస్తం’ పేరుతో రాబోయే ఐదేళ్లలో 30 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని యువతను ఊరిస్తున్నారని, మరో ఏడెనిమిది నెలల్లో ఎన్నికలకు వెళుతున్న తరుణంలో ఇలాంటి ప్రకటనలు చేసి యువతను మోసం చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ మళ్లీ గెలుస్తుందనే గ్యారంటీ ఉందా అని ఆయన ప్రశ్నించారు. సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం శత వర్ధంతిని పురస్కరించుకుని à°ˆ నెల 15à°¨ కోటిపల్లి బస్డాండు వద్దనున్న విగ్రహం వద్ద తనతో పాటు కందుకూరి కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులందరితో కందుకూరి ఆశయాలకు పునరంకితం అవుతామంటూ ప్రతిజ్ఞ చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారని విలేకరులు ప్రశ్నించగా... దీనిపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుదని దుర్గేష్‌ స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో చిరంజీవి యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఏడిద బాబి, దాసరి శేషగిరి, రామకృష్ణ, శివ పాల్గొన్నారు.