శివాజీ చెప్పింది నిజమైందా

Published: Friday September 14, 2018
అమరావతి: సీఎం చంద్రబాబుకు ఓ రాజ్యాంగబద్ధ సంస్ధ నుంచి నాలుగైదు రోజుల్లో నోటీసులు అందబోతున్నాయని హీరో శివాజీ కొద్దిరోజుల క్రితం ప్రకటించి కలకలం రేపారు. అప్పటి నుంచి ఏపీలో చర్చ జరుగుతూనే ఉంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతున్న తరుణంలోచంద్రబాబుకు బాబ్లీకేసులో మళ్లీ నోటీసులివ్వడం తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీస్తోంది. ఈ కేసు అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ, ఏపీకి ముడిపడి ఉంది. నిజానికి అప్పట్లో చంద్రబాబుపై కేసులను మహారాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అయితే తెలంగాణలో ఎన్నికలు జరుగబోతున్న సమయంలో ఇప్పడు ఈ నోటీసుల అంశం తెరపైకి రావడం కొత్త చర్చకు దారితీసింది.
 
 
చంద్రబాబు ప్రస్తుతం ఏపీ సీఎంగా ఉండటంతో ఈ కేసును కేంద్రంలోని ఏదైనా సంస్థకు అప్పగిస్తారా..అనే అంశంపై కూడా చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ అంశంపై న్యాయనిపుణుల సలహాలను ఏపీ ప్రభుత్వం తీసుకుంటోంది. తెలంగాణలో ఎన్నికలు జరుగబోతున్నందున కోర్టుకు హాజరైతే ఎలా ఉంటుందనే దానిపై సమాలోచనలు జరుగుతున్నాయి.
 
 
ఇటీవల చంద్రబాబును ముఖ్యమంత్రి పదవి నుంచి దించేందుకు బీజేపీ పెద్దలు కుట్రలు చేస్తున్నారని à°¶à°¿à°µà°¾à°œà±€ ఆరోపించారు. ఆదినుంచీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న కేంద్ర ప్రభుత్వం.. అందుకోసం రూపొందించిన ఆపరేషన్ గరుడను మరో రూపంలో అమలు చేయబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. à°ˆ ఆపరేషన్‌లో భాగంగా చంద్రబాబుకు కేంద్రం నోటీసులు జారీ చేస్తున్నట్లు తనకు సమాచారం అందిందన్నారు. నాలుగు రోజులు ఆలస్యమైనా నోటీసులు ఇస్తారని శివాజీ వెల్లడించారు.