సానుభూతి, ప్రచారం కోసమే బాబు డ్రామా

Published: Saturday September 15, 2018
 à°®à°¹à°¾à°°à°¾à°·à±à°Ÿà±à°° నుంచి నోటీసుల పేరిట సీఎం చంద్రబాబు మరో డ్రామాకు తెరదీశారని, సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ, నోటీసులను చూసి చంద్రబాబు భయపడే à°°à°•à°‚ కాదని, ప్రచారం కోసమే ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుపై బీజేపీకి కక్షసాధింపు అవసరం లేదని తెలిపారు. పీడీ ఖాతాలపై విచారణ చేయిస్తే ఆయన బాగోతం అంతా బయటపడుతుందన్నారు. రాహుల్‌ను వాటేసుకొని టీడీపీ డ్యుయెట్‌ పాడుకుంటోందని ఎద్దేవా చేశారు. సినిమా నటుడు శివాజీకి సినిమాల్లో వేషాలు లేకపోవడం వల్లే ప్యాకేజీ తీసుకొని డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. బాబ్లీ ప్రాజెక్టుకు సంబంధించి నమోదైన కేసుల్లో చంద్రబాబు మహారాష్ట్ర కోర్టుకు 22 సార్లు హాజరుకాకపోవడం వల్లే నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ అయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విజయవాడలో అన్నారు.
 
వాయిదాలకు వెళ్లకుండా చంద్రబాబు న్యాయస్థానాన్ని అగౌరవపరిచారన్నారు. 2013 నుంచి బాబ్లీ కేసు నడుస్తోందని, అప్పటి నుంచీ చంద్రబాబుకు నోటీసులు వస్తున్నాయని తెలిపారు. 2016 వరకు అప్పుడప్పుడూ కోర్టులకు వెళ్తూ వచ్చారన్నారు. ఈ నోటీసుల వెనుక ప్రధాని మోదీ ఉన్నారన్నది అవాస్తవమన్నారు. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ, బాబ్లీ ప్రాజెక్టుకు సంబంధించిన కేసు 2010లో నమోదైతే బీజేపీపై ఎలా నిందలు వేస్తారని ప్రశ్నించారు. ఈ నోటీసులపై టీడీపీ నాయకులు అక్కడి ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు.