దేశంలో ఎక్కడ వైద్యం చేయించుకున్నా వర్తింపు

Published: Tuesday September 18, 2018
 à°¤à°¾à°¨à± అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ర్టానికి పరిమితం చేయకుండా దేశంలో ఎక్కడ చికిత్స చేయించుకున్నా వర్తింపజేస్తానని వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా సోమవారం విశాఖ జిల్లా ఆనందపురం, పూలమార్కెట్‌ ప్రాంగణంలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్‌ మాట్లాడారు. పేదవాడి వైద్యం కోసం తన తండ్రి వైఎస్‌ à°’à°• అడుగు ముందుకేసి ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే, తాను రెండడుగులు ముందుకేసి మరింత విస్తృత పరుస్తానన్నారు. దేశంలో ఎక్కడ వైద్యం చేయించుకున్నా à°† మొత్తం ఖర్చును ప్రభుత్వం చెల్లించేలా చూస్తానన్నారు. వైద్య ఖర్చులు వెయ్యి రూపాయలు దాటితే ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రోగి ఆపరేషన్‌ చేసుకున్న తర్వాత ఆరు నెలలు విశ్రాంతి అవసరమైతే నెలవారీ భృతి ఇస్తానన్నారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీని రాష్ట్రానికే పరిమితం చేయడంతో హైదరాబాద్‌ వెళ్లి వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో అనేక మంది మృతి చెందుతున్నారని చెప్పారు.
 
ఆస్పత్రులకు ప్రస్తుతం ఎనిమిది నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ à°•à°¿à°‚à°¦ రోగులను చేర్చుకోవడం లేదన్నారు. భీమిలి నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను టీడీపీ నేతలు కబ్జా చేసి అమ్ముకుంటున్నారని జగన్‌ ఆరోపించారు. ప్రభుత్వ రికార్డులు మార్చి పేదల కడుపులు కొడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిపిస్తే ఇంటికొక కేజీ బంగారం, ఇంకా అవసరమైతే బెంజి కారు కూడా ఇస్తానని చంద్రబాబు చెబుతారని ఎద్దేవా చేశారు. జగన్‌ పాదయాత్ర గుమ్మడివానిపాలెం నుంచి ప్రారంభమై నీళ్లకుండీలు జంక్షన్‌, మిందివానిపాలెం, గుడిలోవ, ప్రకృతివానిపాలెం, ఈగలవానిపాలెం, ఎల్‌వీపాలెం మీదుగా ఆనందపురం జంక్షన్‌కు చేరుకుంది. ఆనందపురంలో రాత్రి బస చేశారు.