ఆయన సంపాదన ఏటా 18 కోట్లు

Published: Tuesday September 18, 2018
ఎమ్మెల్యేల వ్యక్తిగత ఆదాయంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారు. ఏటా అత్యంత ఎక్కువ ఆదాయం కలిగిన శాసనసభ్యుల్లో ఆయన ఐదో స్థానంలో ఉన్నారు. à°ˆ మేరకు దేశంలో అన్ని రాష్ట్రాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేల వ్యక్తిగత ఆదాయం, వృత్తిపై ప్రజాస్వామ్య సంసంస్కరణల సంఘం (ఏడీఆర్‌) నివేదిక విడుదల చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్లలో పేర్కొన్న వివరాల ఆధారంగా 4,086 సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో 3,145 మంది వార్షిక ఆదాయ వివరాలను వెల్లడించింది. ఆదాయాన్ని వెల్లడించని కారణంగా 941 మంది ఎమ్మెల్యేల వివరాలను à°ˆ నివేదికలో చేర్చలేదు. à°•à°¡à°ª జిల్లా పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్‌ వార్షిక వ్యక్తిగత ఆదాయం రూ.13.92 కోట్లు ఉందని ఏడీఆర్‌ తెలిపింది. ఆయన జీవిత సహచరి, ఇతర కుటుంబ సభ్యుల ఆదాయంతో కలుపుకొని మొత్తం రూ.18.13 కోట్లు ఉంటుందని పేర్కొంది.
 
అత్యధిక ఆదాయం కలిగిన టాప్‌-20 ఎమ్మెల్యేల్లో నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డి (14) కూడా ఉన్నారు. ఆయన వ్యక్తిగత ఆదాయం రూ.6.48 కోట్లు, కుటుంబ సభ్యుల ఆదాయాన్ని కలుపుకొని రూ.7.96 కోట్ల వార్షిక ఆదాయం ఉంటుందని ఏడీఆర్‌ సంస్థ తేల్చింది. కాగా.. కాంగ్రె్‌సకు చెందిన కర్ణాటకలోని హోసకోటె ఎమ్మెల్యే ఎన్‌.నాగరాజు రూ.157 కోట్ల ఆదాయంతో మొదటి స్థానంలో నిలిచారు. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర మలబార్‌హిల్స్‌ బీజేపీ ఎమ్మెల్యే మంగళ్‌ ప్రభాత్‌ లోధా (రూ.34.66 కోట్లు), కర్ణాటక ఆర్కేపురా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బసవరాజ (రూ.27.77 కోట్లు), తమిళనాడు నంగునేరి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హెచ్‌.వసంతకుమార్‌ (రూ.22.65 కోట్లు) ఉన్నారు. వీరి తర్వాతి స్థానం జగన్‌దే. కాగా.. దేశంలోనే అత్యల్ప వార్షిక ఆదాయం కలిగిన ఎమ్మెల్యే తెలుగు దేశం పార్టీకి చెందిన శింగనమల ఎమ్మెల్యే యామినీబాల అని ఏడీఆర్‌ వెల్లడించింది. ఆమె వార్షిక వ్యక్తిగత ఆదాయం కేవలం రూ.1301 మాత్రమే! అలాగే వైసీసీకి చెందిన నూజివీడు ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్‌ అప్పారావు వ్యక్తిగత ఆదాయం రూ.60 వేలని తెలిపింది.