పథకంపై ప్రచారంలో ప్రధాని ఫొటో పెట్టండి

Published: Thursday September 20, 2018
చంద్రన్న బీమా పథకంపై బుధవారం శాసనసభలో చర్చ సందర్భంగా బీజేపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్యుద్ధం నడిచింది. బీజేపీ పక్షనేత విష్ణుకుమార్‌ రాజు మాట్లాడుతూ ‘చంద్రన్న బీమా పథకం వెబ్‌సైట్‌లో, ప్రచార పోస్టర్లపై సీఎం చంద్రబాబు, కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ ఫొటోలు మాత్రమే వేస్తున్నారు. à°ˆ పథకానికి కేంద్ర, రాష్ట్రాలు 45à°ƒ55 నిష్పత్తి నిధులు ఇస్తున్నాయి. అటువంటప్పుడు ప్రచార పత్రాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటో ఎందుకు పెట్టడంలేదు?’ అని ప్రశ్నించారు. à°ˆ పథకాన్ని ‘ప్రధానమంత్రి- చంద్రన్న బీమా పథకం’à°—à°¾ పేరు మార్చాలని డిమాండ్‌ చేశారు. వెబ్‌సైట్‌లో పీఎంజేవై అని ఇంగ్లీషు అక్షరాలతో రాస్తున్నారని, ఇప్పుడు à°† అక్షరాల సైజు మరింత తగ్గిందని చెప్పారు. ప్రధాని ఫొటో గురించి అధికారులను అడిగితే ప్రింటింగ్‌లో ప్రాబ్లమ్‌ అంటున్నారు. మంత్రివర్యులు కూడా ప్రధాని ఫొటో వేయడం మర్చిపోతున్నారు అని ఎద్దేవా చేశారు. దీనిపై గిడ్డి ఈశ్వరి స్పందిస్తూ.. ‘ప్రత్యేక హోదా ఇచ్చి, విభజన హామీలు నెరవేర్చండి. అప్పుడు ప్రధాని ఫొటో పెట్టడమే కాదు.. ఫొటో పెట్టి పూజలు కూడా చేస్తాం’ అని చెప్పారు.
 
చంద్రన్న బీమా పథకం ప్రచారంలో మోదీ ఫొటో పెట్టలేమని కార్మిక మంత్రి పితాని సత్యనారాయణ స్పష్టం చేశారు. పీఎంజేజేవై అన్న పేరు చేర్చామని, కానీ ప్రధాని ఫొటో పెట్టడం ప్రజలకు కూడా ఇష్టం లేదని చెప్పారు. ‘ప్రధానమంత్రిగా నరేంద్రమోదీని తాను, తన ప్రభుత్వం గౌరవిస్తుంది. రాష్ట్రానికి కేంద్రం తీరని అన్యాయం చేస్తున్నప్పుడు, మోదీ ఫొటో ఎందుకు పెడతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మోదీ ఫొటో పెట్టాలా? వద్దా అనేది 1100 ద్వారా ప్రజలను à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకుంటాం. ప్రజలు అంగీకరించకుండా ఏమీ చేయలేం’ అని చెప్పారు. దీనిపై విష్ణుకుమార్‌ రాజు స్పందిస్తూ.. ‘టీడీపీ ఎన్డీయే నుంచి విడిపోయినా ఇప్పటికీ మా ఆఫీసులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో ఉంది. మేం దానిని తీసేయలేదు. వ్యక్తిగత బీమా పఽథకానికి ప్రధాని ఫొటో ఎందుకని అడుగుతున్నారు. మరి సీఎం ఫోటోలు ఎలా వాడుతున్నారు?’ అని ప్రశ్నించారు. à°ˆ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ.. ‘ప్రధాన మంత్రి ఫొటోలు పెట్టడం లేదని ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలు ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి ఎందుకు మాట్లాడరు? à°† పార్టీలో కాస్తో కూస్తో ఆలోచించి మాట్లాడే వ్యక్తుల్లో విష్ణుకుమార్‌ రాజు ఒకరు. మీరైనా ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని, బీజేపీని నిలదీయండి’ అని సూచించారు.