పోలీసులను కించపరిస్తే సహించం ఏ పార్టీ వాళ్లకైనా ఇదే హెచ్చరిక

Published: Friday September 21, 2018
‘‘ఏ పార్టీ వారైనా, ఏ నాయకుడైనా... పోలీసు వ్యవస్థను కించపరిచేలా మాట్లాడితే నాలుక తెగ్గోస్తాం. తస్మాత్‌ జాగ్రత్త!’’ అని పోలీసు అధికారుల సంఘం హెచ్చరించింది. అనంతపురం జిల్లాలో ప్రభోదానంద ఆశ్రమ వివాదం విషయంలో ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. సిగ్గులేని పోలీసులు, నిర్వీర్యమైన వ్యవస్థ, ఉన్నట్టా చచ్చిపోయినట్లా అని జేసీ ఇటీవల మండిపడ్డారు. అంతేకాదు... ‘మీరు ఇంతే’ అనేలా పోలీసుల ముందు హిజ్రాలతో నృత్యాలు చేయించారు. దీనిపై అటు రాష్ట్ర పోలీసు అధికారుల సంక్షేమ సంఘం, అనంతపురం జిల్లా సంఘం ప్రతినిధులు తీవ్రంగా స్పందించారు. అనంతపురంలో గురువారం సంఘం జిల్లా అధ్యక్షుడు సాకే త్రిలోకనాథ్‌, కార్యదర్శి ఇన్స్‌పెక్టర్‌ గోరంట్ల మాధవ్‌, సంయుక్త కార్యదర్శి సూర్యకుమార్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘ఇటీవల పార్టీలకు అతీతంగా కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీలు పోలీసు వ్యవస్థ స్థైర్యం దెబ్బతినేలా మాట్లాడుతున్నారు. నక్సలిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని, రౌడీయిజాన్ని ఒంటిచేత్తో అణచివేశాం. à°† విషయం మరిచిపోవద్దు. ఇన్నాళ్లు సంయమనం పాటించాం. ఇకపై సహించేది లేదు.
 
    అదుపు తప్పి మాట్లాడితే నాలుక తెగ్గోస్తాం’’ అని సంఘం కార్యదర్శి గోరంట్ల మాధవ్‌ హెచ్చరించారు. ‘à°ˆ విషయాన్ని గుర్తుంచుకోండి... తస్మాత్‌ జాగ్రత్త’ అని సూటిగా చెప్పారు. హిజ్రాలతో పోల్చుతూ నృత్యాలు చేయించడంపై స్పందిస్తూ... ‘‘మేమూ రాయలసీమ బిడ్డలమే. మాకూ పౌరుషం ఉంది. మగాళ్లం కాబట్టే పోలీసు వ్యవస్థలోకి వచ్చాం! à°ˆ వ్యవస్థలో పని చేస్తున్నాం!’’ అని మీసం మెలేసి చెప్పారు. హిజ్రాలతో పోల్చిన వారికి ఇదే తమ సమాధానమని తెలిపారు. అక్కడక్కడ జరిగే చిన్నపాటి తప్పిదాలకు మొత్తం వ్యవస్థనే కించపరిచేలా మాట్లాడటం తగదన్నారు. ‘మీ రాజకీయ నాయకులు ఎక్కడా, ఎప్పుడూ విఫలం కాలేదా?’ అని నిలదీశారు. కానిస్టేబుల్‌ నుంచి అత్యున్నతస్థాయిలో డీజీపీ వరకు పోలీసు వ్యవస్థ ఎలా పని చేస్తుందో గమనించి మాట్లాడాలని గోరంట్ల మాధవ్‌ హితవు పలికారు. à°’à°• ప్రజాప్రతినిధిగా ఉండి పోలీసు వ్యవస్థ పట్ల దిగజారుడుగా మాట్లాడటం నీచమైన సంస్కృతి అని సంఘం నేతలు పేర్కొన్నారు. ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, క్షమాపణ చెప్పి తన గౌరవాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు.
 
చట్టం మీ చుట్టం కాదు: రాష్ట్ర సంఘం
పోలీసులపై జేసీ వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గంగా, హేయంగా ఉన్నాయని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు à°’à°• ప్రకటనలో పేర్కొన్నారు. à°ˆ వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘‘పోలీసులు రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పని చేస్తారు. చట్టం ఏ ఒక్కరి చుట్టం కాదు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు?’’ అని జేసీని ప్రశ్నించారు. శాంతి భద్రతలు ఉంటేనే పరిశ్రమలు వస్తాయని, అభివృద్ధి జరుగుతుందన్న సీఎం ఆకాంక్షలకు భిన్నంగా జేసీ వ్యవహరిస్తున్నారని శ్రీనివాసరావు పేర్కొన్నారు. పదేపదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ నేతలు ఇలా వ్యవహరించడం తగదన్నారు. ‘‘అత్యంత శ్రద్ధగా విధులు నిర్వహిస్తున్నందుకే దేశంలోనే ఏపీ పోలీస్‌ నంబరు వన్‌à°—à°¾ ఉంది’’ అని చెప్పారు.