హ్యాపీ బర్త్ డే గూగుల్ తల్లి....

Published: Thursday September 27, 2018
ఏదైనా డౌట్ వస్తే.. ఏదైనా తెలుసుకోవాలంటే.. ‘గూగుల్ తల్లి ఉంది కదా’ అనడం à°ˆ రోజుల్లో చాలా కామన్. à°ˆ సాంకేతిక యుగంలో గూగుల్ వినియోగం సర్వసాధారణం అయిపోయింది. ఏ చిన్న సందేహం వచ్చినా వెంటనే గూగుల్‌ ఓపెన్ చేసి.. సెర్చ్ చేయడం జనానికి అలవాటుగా మారింది. అంతగా జనానికి చేరువైన గూగుల్ బర్త్ డేని ఏటా సెప్టెంబర్ 27à°¨ నిర్వహిస్తోంది దాని యాజమాన్యం. à°ˆ ఏడాదితో గూగుల్‌కు 20 ఏళ్లు పూర్తయ్యాయి. à°ˆ సందర్భంగా à°“ యానిమేటెడ్ డూడుల్ రూపొందించింది గూగుల్ డూడుల్ టీమ్. 1998 నుంచి 2018 వరకు గూగుల్ ప్రయాణం డూడుల్‌లో కళ్లముందు కదలాడుతోంది. 1998లో గూగుల్ అంటే ఏంటితో మొదలు పెడితే.. 2000 సంవత్సరంతో కొత్త శతాబ్దంలోకి ఎంటరవ్వడం, 2002 ఫుట్ బాల్ వరల్డ్ కప్, à°† తర్వాత ఫ్లూటో గ్రహమేనా అనే వాదన, 2012 యుగాంతం, 2013 జీఐఎఫ్‌ని వినియోగం ప్రారంభం కావడం ఇలా అన్ని అరుదైన సందర్భాలను గుర్తు చేస్తోంది డూడుల్. చివరగా 20ఏళ్లుగా తమను ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపింది ‘గూగుల్’ డూడుల్ టీమ్. 
 
గూగుల్ సంస్థను అధికారికంగా ప్రారంభించింది సెప్టెంబర్ 4, 1998 అయినా.. 2013 నుంచి సెప్టెంబర్ 27ని ‘గూగుల్ బర్త్ డే’à°—à°¾ నిర్వహిస్తున్నారు. దీనికి à°—à°² ప్రత్యేక కారణం ఏంటనేది మాత్రం ఇప్పటి వరకు బయటపెట్టలేదు గూగుల్ యాజమాన్యం.