మోదీ... విశ్వసనీయత ఏదీ?

Published: Saturday September 29, 2018
ఎన్నికల ముందు అవినీతిపరుల తాట తీస్తామని ఘనంగా చెప్పిన మోదీ... ఇప్పుడు అదే అవినీతిపరులకు అండగా నిలిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. దీంతో ప్రధానమంత్రి విశ్వసనీయత కోల్పోయారన్నారు. ఐక్యరాజ్యసమితి సదస్సులో ప్రసంగించాలని తనకు ఆహ్వానం అందడాన్ని జీర్ణించుకోలేని బీజేపీ నేతలు అసూయతో నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. అమెరికా పర్యటన ముగించుకుని శుక్రవారం తిరిగి వచ్చిన చంద్రబాబు... అరకులో మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను పరామర్శించిన అనంతరం ఉండవల్లిలోని ప్రజా వేదిక భవనంలో మీడియాతో మాట్లాడారు.
 
‘‘అవినీతి కేసుల్లో ప్రతి శుక్రవారం కోర్టులో విచారణకు హాజరై.. బయటకు వచ్చి నాపై ఆరోపణలు చేస్తుంటారు. నాపై 26 విచారణలు జరిపించారు. ఏమీ సాధించలేకపోయారు. ఇప్పుడు కూడా కేసులు పెట్టుకుంటే పెట్టుకోమనండి. రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరితే నాపై ఇటువంటి దాడులు ఏమిటి?’ అని చంద్రబాబు నిలదీశారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులతో ఏర్పడిన కొత్త రాష్ట్రంలో ఫలితాలను చూపించగలిగామని, బీజేపీ రాష్ట్రాలు తమతో పోటీ పడలేకపోతున్నాయని అన్నారు. ‘‘కేంద్రానికి ఇష్టం లేకున్నా అనేక శాఖల్లో అత్యధిక అవార్డులు మనకే వస్తున్నాయి. à°ˆ విషయంలో బీజేపీ రాష్ట్రాలు ఎక్కడున్నాయి? విమర్శల్లో మాత్రం వాళ్లు మొదటి స్థానంలో ఉన్నారు. నాపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. రాఫెల్‌ కుంభకోణానికి ఏం సమాధానం చెబుతారు? ఆర్థిక నేరగాళ్లు మీకు తెలిసే దేశం వదిలి పారిపోయారని మీ పార్టీ వాళ్లే చెబుతున్నారు. మీ జవాబు ఏమిటి’’ అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. రాఫెల్‌ కుంభకోణంపై విపక్ష ఎంపీల రాజీనామాలతోనే సరిపోదని, à°† అంశాన్ని అవి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ముఖ్యమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. à°† దిశగా ప్రతిపక్షాలు పనిచేయాలని పిలుపిచ్చారు.
 
ఐరాస పిలిస్తే మీకెందుకు బాధ?
ప్రకృతి సేద్యంపై నిర్వహించిన సదస్సుకు ఐక్యరాజ్యసమితి తనను పిలిస్తే బీజేపీ నేతలకు బాధ ఎందుకని చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు లేవనెత్తిన సందేహాలు, ప్రశ్నలపై పరోక్షంగా స్పందించారు. ‘‘ఐరాసలో పర్యావరణ విభాగం ఉంది. ప్రకృతి సేద్యంపై ఆంధ్రప్రదేశ్‌ అనుభవాలను తెలుసుకోవాలన్న ఆసక్తితో పిలుస్తున్నామని నాకు పంపిన లేఖలో రాశారు (దానిని ఆయన చదివి వినిపించారు). à°ˆ లేఖను మీడియాకు కూడా విడుదల చేశాం. à°ˆ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఎవరినైనా పిలిచారా? ప్రకృతి సేద్యంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా కృషి చేశామని గుర్తించి మనల్ని పిలిచారు. మన అనుభవాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకుని చర్చిస్తున్నారు. ప్రతి దానిపైనా పద్ధతి లేకుండా విమర్శలు చేయడం.. బుకాయించడం నీచం’’ అని విమర్శించారు. ఢిల్లీలో కూర్చుని రెండు విలేకరుల సమావేశాలు పెడితే సరిపోదంటూ పరోక్షంగా జీవీఎల్‌పై మండిపడ్డారు.
 
అవినీతి కట్టడి...
అవినీతిని నియంత్రించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. ఇసుక సహా వంద సర్వీసుల అమలును నిత్యం పర్యవేక్షిస్తున్నామన్నారు. ర్యాంప్‌ నుంచి ఇసుక కొంటున్న వారికి ఫోన్లు చేసి à°Žà°‚à°¤ ధరకు తీసుకుంటున్నారో.. à°Žà°‚à°¤ ఇసుక తీసుకుంటున్నారో కూడా నమోదు చేస్తున్నామని చెప్పారు. ‘‘పింఛను, రేషన్‌ బియ్యం, బీమా, రుణం అన్నీ అందినా కొందరు మాపై బలమైన వ్యతిరేకతతో ఉంటారు. అన్నీ తీసుకుని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో వారికే తెలియాలి. వారిని కూడా మార్చాలని ప్రయత్నిస్తున్నాం. పేదలు ఏ పార్టీ వారైనా వివక్ష లేకుండా పథకాలు ఇస్తున్నాం. గ్రామాలకు వెళ్లినప్పుడు నిజంగా అర్హులు కనిపిస్తే వారికి కూడా ఇవ్వాలని అధికారులను ఆదేశించాం. చంద్రన్న బీమా, పెళ్లి కానుక, విదేశీ విద్య వంటి పథకాలన్నీ పార్టీలతో సంబంధం లేకుండా అమలవుతున్నాయి. కావాలంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లి చూద్దాం. ఎక్కడ అమలు బాగుందో తెలుస్తుంది’ అని చంద్రబాబు చెప్పారు.