యువ నేస్తంతో కొత్త భరోసా

Published: Wednesday October 03, 2018
 ‘‘ఇది యువ నేస్తం. ఎన్నికల కోసం ప్రవేశపెట్టిన పథకం కాదు. యువతను జీవితంలో గెలిపించేందుకు పెట్టిన పథకం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ నిరుద్యోగ భృతి చెల్లింపు పథకాన్ని మంగళవారం గాంధీ జయంతి సందర్భంగా చంద్రబాబు ప్రారంభించారు. ఉండవల్లిలోని ప్రజా వేదిక సమావేశ మందిరంలో వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చిన యువనేస్తం లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగించారు. వారికి భృతి ధ్రువపత్రాలు అందించారు. యువత గెలుపే తన గెలుపుగా అభివర్ణించారు. నిరుద్యోగ భృతి నిరంతరంగా కొనసాగే పథకమని, అర్హులందరినీ అక్కున చేర్చుకుంటుందని స్పష్టం చేశారు.
 
à°ˆ పథకం à°•à°¿à°‚à°¦ 2.10 లక్షల మంది అర్హత సాధించారని... వారందరికీ బుధవారం నిరుద్యోగ భృతి రూ.వెయ్యి చొప్పున జమ అవుతుందని సీఎం ప్రకటించారు. à°ˆ పథకాన్ని గాంధీజీ, లాల్‌ బహదూర్‌ శాస్ర్తి వంటి మహనీయుల జయంతి రోజున మొదలుపెట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. చదువుకున్న తర్వాత తల్లిదండ్రులపై ఆధారపడకుండా, తమ కాళ్లపై తాము నిలబడేలా యువ నేస్తం దోహద పడుతుందని చంద్రబాబు తెలిపారు. ‘‘మీ అందరికీ యువనేస్తం à°’à°• వేదికగా ఉపయోగపడుతుంది. à°’à°• భరోసాను అందిస్తుంది. ప్రముఖ నైపుణ్య శిక్షణ సంస్థలతో శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగాలు వచ్చేలా చేస్తాం’’ అని తెలిపారు. యువనేస్తం పథకం రూపకల్పనకు మంత్రి నారా లోకేశ్‌ రెండు నెలల్లో 38 సమీక్ష సమావేశాలు నిర్వహించారని అభినందించారు.
 
యువత ఆలోచించాలి...
‘‘కొందరు నన్ను రేయింబవళ్లు విమర్శిస్తున్నారు. అందుకు నేను బాధపడడం లేదు. కానీ, అలా విమర్శించే వాళ్ల అర్హత ఏంటి? వాళ్లు జీవితంలో ఏదైనా సాధించారా? క్రమశిక్షణతో ముందుకెళ్లారా? దీనిపై యువత ఆలోచించాలి’’ అంటూ విపక్ష నేత జగన్‌పై చంద్రబాబు విసుర్లు రువ్వారు. తన తండ్రిని అడ్డుపెట్టుకుని మొత్తం దోచుకున్నారని, అడ్డంగా దొరికి అడుక్కునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ‘‘ఎవరికైనా క్యారెక్టర్‌ చాలా ముఖ్యం. ఒకసారి క్యారెక్టర్‌ పోతే మళ్లీ జీవితంలో దాన్ని సాధించలేం’’ అని తెలిపారు. జనసేన అధిపతి పవన్‌పైనా విమర్శలు గుప్పించారు. ‘‘సినిమాలు వేరు, జీవితం వేరు. ఎక్కడో ఒకరో ఇద్దరో సాధిస్తారు తప్ప అంతా కాదు’’ అని తెలిపారు. ఎప్పటికప్పుడు ఆలోచించి, మంచిని సమర్థిస్తే అందరికీ మంచి జరుగుతుందని తెలిపారు.
 
‘‘2004లో కూడా టీడీపీ అధికారంలోకి వచ్చిఉంటే అభివృద్ధిలో ఎక్కడికో వెళ్లేవాళ్లం. ఇప్పుడు కొత్త రాష్ట్రం. కష్టపడి చేస్తున్నాం. 2024కు దేశంలో తొలి మూడు అగ్రరాష్ట్రాల్లో à°’à°•à°Ÿà°¿à°—à°¾, 2029à°•à°¿ దేశంలో నెంబర్‌వన్‌ రాష్ట్రంగా నవ్యాంధ్రను నిలుపుతా. 2050 నాటికి ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌à°—à°¾ ఏపీ ఉంటుంది. ఇది సాధించడం నా ఒక్కడి వల్లే కాదు. మీ సహకారం అవసరం. అప్పుడు కేంద్రం సహకరించకున్నా, సహకరించినా అభివృద్ధి ఆగదు’’ అని చంద్రబాబు తెలిపారు. కేంద్రం మెడలు వంచైనా రాష్ట్రానికి రావాల్సినవన్నీ సాధిస్తామని స్పష్టం చేశారు. à°ˆ కార్యక్రమంలో మంత్రులు లోకేశ్‌, కొల్లు రవీంద్ర, సీఎస్‌ అనిల్‌ చంద్ర పునేఠా పాల్గొన్నారు.