‘జనబాట’ విజయవంతానికి నిర్దేశం

Published: Sunday October 07, 2018
తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నిర్వహించే ‘జనబాట’ కవాతుతో రాజకీయాల్లో సమూల మార్పు తీసుకొద్దామని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పిలుపు ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా నాయకులు, కార్యకర్తలతో శనివారం విజయవాడలో పవన్‌ సమావేశమయ్యారు. ధవళేశ్వరం కవాతు తర్వాత దేశం మొత్తం జనసేన గురించే మాట్లాడుకోవాలని, à°ˆ దిశగా ఏర్పాట్లు ఉండాలని వారికి మార్గనిర్దేశం చేశారు. ప్రశ్నించడం ద్వారానే అధికారాన్ని సాధిస్తామన్నారు. నిజాయితీగా ఎన్నికలు జరగకపోవడం వల్ల వెనుకబడిన వర్గాలు అధికారానికి దూరమయ్యారని, ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానపర్చడమేనన్నారు. అధికార వికేంద్రీకరణ, పంచాయతీల బలోపేతమే జనసేన ఆలోచనా విధానమని స్పష్టం చేశారు. అధికారం అనేది మార్పులో భాగం కావాలని, అదే అంతిమ లక్ష్యం కాకూడదన్నారు.
 
పశ్చిమ గోదావరి జిల్లాలో మరో రెండు రోజుల్లో పోరాట యాత్ర పూర్తవుతుందని, తర్వాత తూర్పు గోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాలలో 20 నుంచి 22 రోజులపాటు పర్యటిస్తానని వెల్లడించారు. à°ˆ నెల 15à°µ తేదీ కవాతుతో జిల్లాపై పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తానని పవన్‌ చెప్పారు. తూర్పుగోదావరి ప్రజల తీర్పు రాష్ట్రం మొత్తాన్నీ ప్రభావితం చేస్తుందన్నారు. తాను ఎంతో విశాల దృక్పథంతో, చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుంటే, కొంతమంది చిన్న చిన్న ఆలోచనలతో ఉంటే ఎలా అని ప్రశ్నించారు. పితాని బాలకృష్ణ మినహా జనసేన నుంచి ఎవరికీ సీటు ఇవ్వలేదని పవన్‌ స్పష్టం చేశారు. టికెట్లు ఇస్తామంటూ ఎవరైనా చెప్తే నమ్మవద్దని అన్నారు. ఇప్పుడు వేసిన కమిటీ పూర్తిస్థాయి కమిటీ కాదని పవన్‌ చెప్పారు. తనతో సహా ఎవరికీ ఎలాంటి అధికారాలూ లేవని, పదవుల రూపంలో బాధ్యతలు మాత్రమే తీసుకున్నామని చెప్పారు. కమిటీ నియామకాల్లో లోపాలుంటే పార్టీ పెద్దలకు చెప్పాలన్నారు. ఐదారు రోజుల్లో విజయవాడలో నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తామని పవన్‌ చెప్పారు.