బద్ద శత్రువులెవరూ లేరు....పవన్‌ కల్యాణ్‌

Published: Monday October 08, 2018
వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సహా రాజకీయాల్లో తనకెవరూ బద్ధ శత్రువులు లేరని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఆదాయ పన్ను శాఖ దాడులు జరుపుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు కోపం వస్తోందో తనకు అర్థం కావడం లేదని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం పరిపాలన స్తంభించిందని తెలిపారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసీమలో రివరిన్‌ రిసార్టులో పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. à°ˆ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వరి, రాపాక వరప్రసాద్‌ జనసేనలో చేరారు. వారికి పవన్‌ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. గిరిజన ఉపాధ్యాయులు, నిర్వాసితులు, యువకులతోనూ సమావేశమయ్యారు. ఆయా సందర్భాల్లో ఆయన ఏమన్నారంటే..
 
 
మొసలి కన్నీరు కార్చితే..
నేరుగా ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాలపై దాడులు జరిగితే వారు స్పందించవచ్చు. కానీ ఎక్కడో గుంటూరు, చెన్నై, అండమాన్‌ దీవుల్లో దాడులు జరుగుతుంటే ఇక్కడ ముఖ్యమంత్రికి ఎందుకు కోపం? మంచి పనిచేస్తే ప్రజల్లో సానుభూతి వస్తుంది. మొసలి కన్నీరు కార్చితే రాదు. నేను మద్దతిస్తున్నప్పుడు మంచి పనులు చేయమన్నాను. ప్రస్తుతం వారు నేను చెప్పింది తప్ప అన్నీ చేస్తున్నారు. నేను పార్టీ పెట్టినప్పటి నుంచీ అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఎన్టీఆర్‌లా ఉప్పెన లేదు. చిరంజీవిలా ప్రవాహం లేదు. నేను రాజకీయాల్లో మార్పు కోసం 25 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేయడానికి వచ్చా. వెంటనే ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరిక లేదు. ప్రస్తుత రాజకీయం కొన్ని కులాలకు మాత్రమే పరిమితమైంది. కులంతో కొన్ని కుటుంబాలే బాగుపడ్డాయి. à°† కులాలు మాత్రం బాగుపడలేదు. à°ˆ ప్రయాణంలో గెలుపోటములను పట్టించుకోను. కులాల మధ్య ఐక్యత అవసరం. నూనూగు మీసాల యువకులే నాకు రక్షణ. నా రక్షణకు ఏకే-47 అవసరం లేదు. వారి ప్రేమే రక్షణ కవచం’.
 
 
పోలవరంలాగే రాజధానినీ చూపాలి..
‘ప్రతిరోజూ పోలవరం చూడడానికి 50 బస్సుల్లో బయట నుంచి ప్రజలు వస్తున్నారు. అదే విధంగా రాజధానిని చూపించడానికి కూడా రోజూ 50 బస్సులు నడపాలని ముఖ్యమంత్రికి విన్నవిస్తున్నా. ఇంకా గోదావరిలో కొద్దిగా ఇసుక మిగిలి ఉంది. టీడీపీ నాయకులు వారికి చేతులు నొప్పి పట్టే విధంగా ప్రతిరోజూ తవ్వుకుంటున్నారు. దెందులూరులో à°’à°• ప్రజా ప్రతినిఽధి కులం పేరుతో అధికారులను తిడుతున్నా.. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను కొడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉపాధ్యాయులకు సీపీఎస్‌ రద్దు అంశం మేనిఫెస్టోలో పెట్టాను. దానిని అమలు చేసి తీరుతాను. పదేళ్ల రాజకీయ అనుభవం నాకుంది. 2009 ఎన్నికలకు నేనున్నాను. 2014లో ఎన్నికల్లో నాకు అనుభవం ఉంది. 2019à°•à°¿ మరోసారి సిద్ధంగా ఉన్నా. గతంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఓట్లు చీలకుండా టీడీపీకి సహకరించాను. à°ˆ పార్టీ వస్తే సమస్యలు తీరాయని ఆశించాను. అయితే నా కోరిక తీరలేదు. 2019లో ప్రభుత్వం స్థాపించే విధంగా ముందుకు సాగుతా.’